పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

432

సౌగంధిక ప్రసవాపహరణము



వెలుచ నుగ్రతగురుభీష్మలమీఁదఁ
బలుచిత్రగతి వీరభద్రుండుపోరె
సాత్యకి ప్రద్యుమ్న సహదేవవరుల1595
నత్యంతబలశక్తి నాగె కుబేరు
డాచార్యతనయతాలాంశులతోఢ
నేచివిఘ్నేశ్వరుం డెగిరి పోరాడె
చలమున పుష్కరపాంబులతోడ
జలదరింపఁ బోరెఁ జండీశ్వరుండు1600
వరుస తక్కిన యోధవరులు యోధులను
బొరిపొరి జయకాంక్ష బోరు నవ్వేళ
అంతట గెరలి రథాంగధరుండు
కంతువిద్వేషిపై గదిసి యుప్పొంగి;
చటుల శిలీముఖసారము ల్నించి1605
పటుతరానిలవహ్ని బాణము ల్దొడిగి
భాసురంబుగ వీరభద్రునిమీఁద
నేసిన నవి దాఁకి యిలఁ గూలె నతఁడు
నారాయణాస్త్రంబు నారి సంధించి
ప్రారూఢమంత్రపూర్వకముగా గుహుని 1610