పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

431



రమణ బాహుబలాభిరాముని రాము
కమనీయనతుల పుష్కరుని పుష్కరుని
పరికించి పురికొల్పి పాంచజన్యంబు
తరుచుగాఁ బూరించి తమకించి మించి1580

ధనువున నైదుశస్త్రములు సంధించి
ఘనరోషచిత్తుఁడై గదిసె కృష్ణుండు
నరవాహనుని ఘోరనారాచములను
విరథుని గావించి వివ్వచ్చుఁ డపుడు
గుణరవం బడర నుగ్రునిమీఁదఁ గదిసి 1585

కృష్ణు డొనర్చినయుద్ధము

మణికేతనునిఁ గూల్చి మణిమంతుఁ జంపి
పవమానతనయుండు పశుపతిమీఁదఁ
గవిసి నిష్ఠురతరకాండము ల్జొనిపి
గురుభీష్మ గురుసుత కురురాజముఖ్యు
లురుశరావళిముంచి రగ్రునిమీఁద 1590

భీమార్జునులమీఁద భీమ ప్రతాప
ధాముఁడై సేనాని తలపడి పోరె