పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

409



పూని కోపున మించి పొంచుకున్నాఁడు
ఎవరిపై దూకునో! యేకార్య మగునొ!
యెవరిఁ జెండాడునో! యెఱుఁగరా దింక
పరమాత్మ ! దీని కుపాయ మే మనిన
నరవాహనునిఁ గాంచి నాగకంకణుఁడు1205
బెదరేల నీకు కుబేర నే నిపుడె
యదుకులాగ్రణి మీఁద నరుగుచున్నాను.
నలినలోచనునకు నాకు వెన్నుద్ది
తిలకింప నతని మీదిక్కు రానీను
బలువిడి పాండవబలములమీఁద1210
తలపడి నీవు యుద్ధముచేసి గెలువు
నరునితో నీవును నలకూబరుండు
సురనదీసూనుతోఁ జోడు గావలయుఁ
గాకున్న నొరులతోఁ గాదు పోరంగ
చేకొని గంధర్వసేనలతోడ1215
గణుతికి నెక్కురాక్షససేనతోడ
ప్రణుతింప కిన్నరబలములతోడ ·
వీరయోధులతోడ వెక్కసంబుగను