పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

408

సౌగంధిక ప్రసవాపహరణము




వినినారుగద మీరు వీనుల కొలఁది?1185
కదనరంగంబునఁ గదిసినవేళ
పదపడి మీ బాహుబలశరప్రౌఢి
ఘనపరాక్రమశక్తి గాన నయ్యెడిని
యనుచుఁ జేతులు జాపి యఖిలసైన్యముల
పరువడి యక్షాదిబలములమీఁదఁ1190

బురికొల్పి శంఖంబుఁ, బూరించుటయును,
అక్కడ ధననాథుఁ డావిధం బంతఁ
గ్రక్కునఁ గాంచి శంకరున కిట్లనియె
గౌరీమనోహర! కంటివే యిపుడు
నీరజనాభుఁడు నీమీఁదఁ గదలె1195

శంకరకుబేర సంభాషణము

వలనొప్ప పాండవవాహినీవితతి
నలిరేగి యుప్పొంగి నామీఁద నడిచె!
గొదకొని హరిణంపుగుంపులఁ గాంచి
పొదలెడు గబ్బిబెబ్బులి విధంబునను
దానవేంద్రుడు మదోద్దండుఁడై కెరలి 1200