పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

410

సౌగంధిక ప్రసవాపహరణము


భైరవుఁ డిదె దైత్యపతిమీఁద నడుచు,
నని పల్కి సెల విచ్చి యఖిలసైన్యముల 1220
గనుఁగొని చేవీచి గదియించుటయును;
ఉభయబలంబు లి ట్లొగిమారుకొనిన
రభసంబు లయ్యె తురంగహేషలును
భేరికానిస్సాణభీకరకాహ
ళారావముల్ పద్మజాండంబు నిండె? 1225
కరిరథఘంటికాఘణఘణంఘాణ
గురుతరధ్వనులు దిక్కులు పిక్కటిల్లె
తలపడి పోరు నత్తరి నెన్నరాని
బలుకయ్య మయ్యె నాబలములు కెల్ల
నీటెల బల్లేల నిలగుదుల్ గ్రుచ్చి1230
తాటుచు దూటుచుఁ దలపడువారు
శత్తుల కత్తుల కకవికల్గాఁగ
హత్తి మత్తిల్లి చెండాడెడివారు
గదలచే గదలచేఁ గదలక నిలిచి
యదలించి కదిసి యేట్లాడెడివారు1235
బెడిదంపు పిడెములఁ బిడెములఁ దొడరి