పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

406

సౌగంధిక ప్రసవాపహరణము



కదనంబునకు మీరు గదియించినారు
హరుఁడు నేర్పరిమీర లధికు లంతకును
తిర మొంద బారులు దీర్చితి రిపుడు
గెలిచిన నోడిన కీర్తులు మీవె
తిలకింప మీమాయఁ దెలియువా రెవరు? 1155
లోకేశ! మీ యాజ్ఞలో నుందు మింతె
గాక స్వతంత్రముల్ గలవార లెవరు?
వలనొప్పఁగా భక్తవత్సలబిరుదు
తలకొని శరణాగతత్రాణబిరుదు
గల దేవుఁడవు నీవు గావె శ్రీకృష్ణ!1160
కలనైన మీదాసగణముల కెల్ల
జయముగా కిల నపజయ మేల గల్గు?
భయ మేల గలుగు నోపరమాత్మ యనిన
భావించి హరిభీష్ము బరికించి పలికె
నీవు నావాఁడవు నేను నీవాఁడఁ1165
గాని యన్యులమే జగన్నుతచరిత!
భానుమానుఁడు నొవ్వబలికినపలుకు
లొకయింత మదిలోన నుంచగా వలదు