పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

405



కనలుచు సకలలోకము లేకమైన1135
హరుని మీమీఁదికి నరుదేర నీఁదు
సొరిది కర్ణుని లావు చూడుము నీవు
సురుచిరంబుగ మిమ్ముఁ జూచు కర్ణుండు
నరమరల్ సేయక నని సల్పవలయు
నందు నిందును గల యఖిలరాజన్యు 1140
లందరు మీవెంట నరిగెడువారె
యన విని వినుతించి యంజలి చేసి
యనుమోద మొదవ గంగాత్మజుం డనియె
కమలామనోహర! కమలాయతాక్ష !
కమలదనిభవర్ణ ! కమలాంకవినుత 1145

భీష్ముని వచనము

ఖగవాహనారూఢ! గజరాజవరద
నగధర! వైకుంఠనాయక! కృష్ణ!
కర్ణుఁ డెవ్వాఁడు గంగాపుత్త్రుఁ డెవఁడు
వర్ణించి చూచిన వాహిను లెవరు
చదరంగబలములు సమకట్టినటుల1150