పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

407



సకలసేనలఁ గూడి సమరంబుచేసి
భువనముల్ వినుతింప భుజశక్తి మెరసి1170
యవలీల గెల్చి రమ్మని సెల విచ్ఛి
రాధాతనూజాకరంబు చేపట్టి
యోధావళుల కెల్ల నొగి చెయిచూపి

కృష్ణుఁడు యుద్ధమునకు సన్నద్ధుఁ డగుట

ప్రమథులపై యదుబలముల నెల్ల
తమకంబుమీర సుధ్ధతి గదియించి1175
కాంచనాంబరుఁడు దిక్తటము లల్లాడ
పాంచజన్యంబు దాఁ బరఁగ మ్రోయించె
అమరనదీసూనుఁ డందరఁ జూచి
తమకంబు గినుక సందడిగొన బలికె
పురుహూతసుత వాయుపుత్ర యాచార్య 1180
గురుతనూభవ కృపకురుకులాధీశ
శకుని దుశ్శాసన సైంధవ నకుల
సకలభూపతులార! జలజలోచనుని
ఘనతరసంగ్రమక్రమవాక్యసరణి