పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

సౌగంధిక ప్రసవాపహరణము




వారిజాక్షిని దోడ్క వచ్చుట గొదువ;
వేడు మిచ్చెద నని వేడిన పిదప
పోడిమి నీ కున్న బొందు పాపములు;
వనజము ల్గొనిపోక వనిత యున్నెడుకు
జనిన నపఖ్యాతి; సకియ దుఃఖించుఁ;
బాయని యపకీర్తి భరమున కోర్చి
పోయెద ననినను బోనీయఁ డితఁడు;
సకలాయుధంబులు చనుటయు మోస
మకట! యీతఁడుచేసె నాబాణహాని;
యితని జంపుదు లేక నితనిచే జుత్తు
నితరంబు లే దని యెంచి క్రోధించి
తలప లోకములోన ధర్మనందనుఁడు
వల నొప్పగా సత్యవంతుఁ డౌ నేని
గోపాలకృష్ణుండు గోరినయపుడె
మాపాలగల్గి యేమరకుండునేని,
యనయంబు.........నంజనకూర్మి
తనయుఁడు నామీఁద దయ గలఁడేని;
పసిడిబంగరుబోలు పాంచాలపుత్త్రి