పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

179


చెలిమినైనను నిల్వ చెల్లదే యకట!
ఆమ్ము లన్నియుఁ బోయె! నాగద బోయె!
కమ్మదమ్ముల కెట్లు గదలెద వింక!2000
తోచక నీచేయుదుడుకు లన్నియును
గాచి రక్షించితి గరుణతో నిపుడు
పగ్గెల బొదలక పదరక లేని[1]
సిగ్గులబడక వచ్చిన త్రో వచనుము
ప్రాణము ల్గలిగిన భార్యలు గలరు2005
బాణముల్ గాంచిన పద్మముల్ గలవు
భూవర! యీ వెఱ్ఱి బుద్ధులు మాని
పోవోయి నీవు నీ పొందుపంట్లకును,
అన విని కడువిన్న యై తలవాంచి
మనుజ వల్లభుఁడు నెమ్మది చింత నొంది2010
తలకక ఘోరకాంతారభూములకు
నెలత దోడ్కొని చన నీతిగా దనుచు
చీరి వేమరు బుద్ధి చెప్పిన వినక

  1. ప్రెగ్గెలబొదలక బెదరకలేని (క )