పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

181




వసుధలోపల పతివ్రత యగునేని,
నెగడువేదంబులు నిక్క మౌనేని;
జగతిలో ధర్మమే జయమగు నేని,
యీవానరునితోడ నీమాయలెల్ల2035
వావిరి దెగటార్చి వరసాధనములు
గైకొని చని హేమకంజము ల్దెచ్చి
రాకేందువదనకు రహి నిత్తు ననుచు
బొసగ గర్జిలి భుజంబులు బెట్టు సరచి
వెసబేర్చి యొక సాలవృక్షంబు బెరికి2040
తనమీఁద నడతెంచు ధాత్రీతలేంద్రు

 ఆంజనేయుఁడు నిజరూపమును దాల్చుట

యనువెల్ల బరికించి యాంజనేయుండు
యనుపమామోఘవాక్యము దప్ప దనుచు
ఘనమైనవృద్దమర్కటరూప ముడిగి
నెనరున నెంతయు నిజరూపు దాల్చి2045
యనుజని మ్రోల ప్రత్యక్షమై నిలిచె[1]

  1. ఎన్నడు గలన న న్నెదిరి పోరాడి
      యున్నవారల గాన నుర్వీతలమున