పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

91


వనిత పోయినయట్ల వచ్చినయట్లు 685
గాకున్న నీమహాగగనంబునందు
నీ కభీష్టం బేమి నిక్కంబుపలుకు
మిచ్చకువచ్చిన నేవస్తువైన
నిచ్చెద నీయాన [1]యిందీవరాక్షి
నావిని నవ్వి యానాళీకపాణి
ఠీవి నెమ్మదిని వాటిల్ల నిట్లనియె 690
ప్రాణేశ నాశోర్కె ఫలియింప నీవు
గాని యింకెవ్వరు గల రెంచి చూడ
నడుగ మంటివి గాన నడుగుట సులభ
మడిగిన యిచ్చట యది దుస్తరంబు
నోటి కొచ్చినయట్ల సూరనవచ్చు.695

మాటాడి నిలుపుట మరికొద్ది కాదు.
సతులు గోరినకోర్కె సఫలంబు సేయ
చతురాననుని కైన శక్యంబు గాదు
బిరుదు వీరుండైన బిరికివాడైన
 

  1. సాధించి, (ట)