పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

సౌగంధిక ప్రసవాపహరణము


సరసి జాక్షులచెంత సాహసుం డౌను 705
ఎదురు దన్నెఱుఁగక నెంతయుఁబల్కు
కదిసి వేడిన వేళ కళవళమందు
వలవని యడియాస వలదు భూపాల!
యలరువనంబుల కరుగుదమన్న[1]
కనకాంగివదనంబు గాంచి యాప్పొంగి 710
యనిలతనూభవుం డనియె నంతయును
ఎంత మాటాడితి విందీవరాక్షి
కంతువిద్వేషితోఁ గదలివచ్చినను
అంభోజసంభవుం డడ్డగించినను
జంభాసురారిమచ్చరము చేసినను 715
కోరి త్రిలోకము ల్గూడివచ్చినను
దారుణి వాక్యంబు దప్పను నేను
తిరమొంద నీకోర్కె దీర్చకయున్న

  1. నెర సాహసండవు నిన్నంటగాదు
    నరనాథ పురుషులనడత లెంచెదను
    చనువున కోపంబు క్షమింపవలయు
    ననిన పాంచాలితో ననిలుజు డనియె.(1378)