పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

సౌగంధిక ప్రసవాపహరణము


ననిలతనూభవుఁ డన్న కి ట్లనియె,
ధరణీశ నీముద్దుతమ్ముఁ డై నట్టి
పరశక్తి గల కపిధ్వజుని యీక్షణమె
పసమించు నస్మదంబరదూతచేత
పొసఁగ మీసమ్ముఖంబునకు రప్పింతు
నుర్వీతలేశ్వర యొకనిరూపంబు
పరువడి వ్రాయించు ఫల్గునుపేరు
నన విని సంతోషితాత్ముఁడై శమన
తనయుండు కరుణ నాతని కౌగిలించి
యాయర్జునుని పేర నపు డొకలేఖ
వ్రాయించి యిచ్చిన వాయుసూనుండు
కరుణతోఁ దనతండ్రి గంధవాహనుఁడు
ఇరవొందఁ దను మెచ్చి యిచ్చినయట్టి
గ్రంథానుసారసత్కమనీయధూప
గంధిలవరమంత్రకలితరభాంగ
బంధబంధురకరభ్రాజితంబైన
గంధపారోజ్జ్వలద్ఘనసాయకంబు
పొది యడలించి యద్భుతముగా నార్చి