పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సారంగధర నాటకప్రదర్శనము

19

క్క పై మంగలి కాఁబోలుఁ గంటికి జోడు పెట్టుకొని తటతటలాడించుచున్నాఁడు. "ఏకమే వాద్వితీయం బ్రహ్మ" అను వేదాంతన్యాయము ననుసరించి దురవగాహమై యజ్ఞాతతేజస్కమైన యొకదీపము కాఁబోలు పాకనడుమను ధుమధుమలాడుచున్నది. రంగస్థలమునఁ దెరదింపఁబడియేయున్నది. దానిలోపలినుండి "సఫేదుపొట్లమేదిరా? నీగొంతుకఁగోయ" యనియుఁ, “జాఁకలిముండకొడు కింక బట్టలు తీసికొనిరాలేదా?" యనియు, “గడ్డమున కీమాత్రపు మాపున్న నేమి? “పౌడర్" మీఁదఁ బఱచి పారిపోకుండ నుండునటరా? " యనియు, “దిక్కుమాలినగడ్డాలు! తగులఁబెట్టిననైన మెతకవాసన పూర్వజన్మ వాసనవలె వదలదురా" యనియు. "కంతిసాని గళ్లచీర, కమ్మలజత ఎరవుదీసికొని వచ్చినవాఁ డెవఁడురా? " యనియుఁ, “బూసలకోటు నన్ను వేసికోనీయనియెడల నే నీరాత్రి వేషమువేసిన యెడలఁ దల్లికి మగఁడు" ననియు, "కోటులో నే మున్నదిరా? గాడిదె గుడ్డు! నోటిలో నుండవలయునురా" యనియుఁ బలువిధములగు రసములతోఁ బలువిధములగు రవములు, కీచు, బొంగు, వెలితి, నలీ, లొడుగు మొదలగు జాత్యుపజాతి లక్షణములతో నాటకశాల దాఁటి నాలుగువీథులు దాఁటిపోవునట్టి ఝంకారములతో బయలువెడలినవి. “ అందర్ ఖామూష్" అని నాటకరంగాధ్యక్షుఁడు నాగుండె లదరున ట్రాక్క చావుకేక వైచినాఁడు. ఇంతలో నంగవస్త్రధారియైన యొక్కఁడు దళముగ బూడిదపట్టించిన మొగముతోఁ ధలకట్టుత్రాళ్లు మెడప్రక్కల వ్రేలాడుచుండఁ గృత్రిమ స్తనసౌభాగ్యమును గుసుంబారవికలో నడచి బిగించి, పైంట లేకుండ నోటిలో లొడితెడు చుట్టను సింగారించి త్రిలోకానందకర దివ్యమంగళ విగ్రహములతోఁ దెరప్రక్కనుండి వెలుపలకు వేంచేసి " ప్రాంప్టింగునకు రెండవపు స్తకముఁ దీసికొని రావైతివి. చావుమంటివాయేమి? నీ స్టేజిమేనేజరీ యేడ్చినట్లే యున్నది." అని తీండ్రించి పలికి యంతలో నన్నుఁజూచి యట్టె సిగ్గుపడి చేతులు రవికకద్దు పెట్టుకొని నోటిచుట్టతోడనే తుర్రున లోనికిఁ బోయెను. “అప్పుడే టిక్కెట్ల యమ్మక మారంభించిన “రాస్కెల్" నిటు చెవిఁబట్టుకొని లాగుకొని రమ్ము, పండ్లు రాలఁగొట్టెదను." అని యధికారికావరమున నాటకాధ్యక్షుఁడు కాఁబోలు లోనుండి యజచెను. ఇంతలో నొకతెరప్ర క్కనుండి యరగడ్డమొకటి కొంతసందేహించుచు వెనుకకు ముందునకు దట పటాయించు చున్నది. ఇంకొకప్రక్కనుండి యొక బొర్రముక్కులో మూఁడు పావులవంతు మట్టునకు మరియొక తెరప్రక్కనుండి లటుకునఁ బొటకరించి యడ్డబాసనున్న కల్లకెంపుతో జగజిగ మెఱయుచుండెను. తళుకుమనునంతలోఁ దుసుక్కు మని తుమ్మెకటి యాద్వారద్వయగ హ్వరము నుండి బాగుగ దట్టింపని “తూటా" సంబంధమగు బుసబుసోద్రేకగుంఫనారబ్దహ రాజ్ఞటిల ధ్వానముతో బయలువెడలఁగఁ గెంపుటడ్డభాస నిరాఘాట పవనధాటిచేఁ గాఁబోలుఁ గ్రిందఁబడిపోయెననుకొంటిని. కాని నాది పొరపాటు. అది ముక్కు పట్టులేకజారిన సింగారము కాదు. నోటి పట్టు లేకజారిన సిగరెట్టు. నటకులను బాహాటముగఁ జూడఁదలఁచి నేను రాఁగా నాప్రారబ్దవశమున నటకులు నన్నిట్లు దొంగపోటునఁ జూచుచుండిరి. దీపాలు పెట్టకుండనే పాకలోనికి దాపురించిన నాటకపు మొగమెరుఁగని యీ యనాగరకవ్యక్తి యీపల్లెటూరి వెర్రివేసము, ఈ యాంగ్లేయ భాషాజ్ఞానశుంఠ యెక్కడనుండి విచ్చే సెనో యని నన్నుఁ జూచి కాంబోలు వెంటనే “హి హి హి" యని సకలింప మొదలు పెట్టిరి.

ఆదినమున గ్రామమునఁ బశువుల సంత యగుటచే రసాదరణ పరిపోషణ పటిష్ఠమగు నితర గ్రామకర్షకలోకము కొంత నాటకదిదృక్షచే వచ్చినది. పాఠశాలలలోఁ జదువుకొను