పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

సాక్షి


బాలురుగూడఁ గొందరు వచ్చి యటునిటు నా సమీపముననే కూరుచుండిరి. వారిలొ వారేమి మాటలాడుకొనుచుండిరో నాకు బాగుగ వినఁబడలేదు. కాని నడుమనడువ మాత్రము కొన్ని కొన్ని మాటలు, “పట్టుపలుపులు” “పంపరపనాసడిప్పలు” “పగలు” రాత్రి యెరుఁగని ప్రాంతచదువులబాపనయ్య “Arrogant Fellow” యనుచు నింకేమేమో వినఁబడెను. ఇంతలో “డొక్క చీల్చిజాలు గొట్టెదను” అని పెద్దయిగిలింపుతో నొక కేక వినవచ్చినది. స్త్రీలకుఁ బ్రత్యేకముగ నుంచినస్థలమున కున్న ద్వారమునొద్ద “నేను గూరుచుండెదను. నేను గూరుచుండెద” నని యిద్దరునటకులు లఘువులయినమాటలచే నూతన సమర సమవాకారమునకు నాందీపూజ చేసి గురువులగు గ్రుద్ధులచే భరతవాక్యము చెప్పిరి. వారిద్దజను గాకుండ మరియొకని నక్కడ గూరుచుండుటకు నధ్యక్షుఁడు నియమించెను. కాని గడియగడియ కొక నటకుఁడు–ఖండకరకార్పాసకూర్వాసము వాఁడ్ హేమాంచలరోచమాన కాచనేత్రములవాఁడో వృశ్చికపుచ్చచ్చ-వివిచ్ఛేదిశ్మశ్రులతా రశ్ములవాఁడో-కమఠపృష్ఠ పరిపాటీసమ శిరోవాటివాఁడో-స్త్రీలున్న యాస్థలమునకు వచ్చి “మీ కన్నియు సరిగా నున్నవికదా!” యనియు, “దగ యగునెడల సోడా” సిద్ధముగనే యున్నదనియు, “మీ రటునిటు పోఁదలఁచినయెడలఁ బ్రత్యేకముగ మీసదుపాయముకొఱ కుంచిన యాస్థలమునకుఁ బోవచ్చు” ననియు, “మీకుఁ క్రింది భాగమున నున్న గోతినిదాఁటిదూలముచేఁ గప్పి పైన గడ్డి బాగుగ వేయించి చాఁపలు పఱపించినను మీకేమైనం గ్రుచ్చుకొనునేమో యని భయపడుచున్నా” ననియు, నిటు లేదో యొక్కొక్కఁ డొక్కొక్క క్షేమ సమాచారవార్త నాకాంతలకు విన్నవించుచుండెను. కాని యొక్కఁ డయిన స్త్రీలసౌఖ్యమునుగూర్చి యశ్రద్ధగ నుండలేదు. నవనాగరక మాహాత్మ్యముచేతఁ గాంతలయెడఁ బురుషు లిట్టి యాదరణమును-ఇట్టి దయను-ఇట్టి భక్తిని ఇట్టి గౌరవమును-ఇట్టి విశ్వాసమును-ఇట్టి ప్రపత్తిని-గనఁబఱచుచుండి రని నే నానంద మొందితిని. ఇంతలో “మీ రాఁడుతోడునఁ బుట్టలేదా? మీరూపములు గాలిపోను. మీసరసములు మాయెదుట నేనా?” యని యేమేమో కొన్ని కాంతాకంఠరవములు వినఁబడెను. ఒక్క పరుగున నెవ్వండో వచ్చి నా ప్రక్కను గూరుచుండిన రక్షకభటాధికారితో “అయ్యా! తమ యాఁడువా రింటికిఁ బోయెద మనుచున్నారు. నటకులు నాట్యాంగనలతోఁ జేయు సరససల్లాపములు సంసారిణులకు శ్రవణపుటఛేదనములుగ నున్నవి." యని చెప్పఁగ నాతఁడు “Scoundrels" అనుచు నహంకారమున లేచి వారి కధికారియగు “మేనేజరును” బిలిపించి యింగ్లీషుభాషతో నేమేమో చెప్పెను. ఆమాటలలో “ప్రాసిక్యూటు” మాత్రము నాచెవినిఁబడెను. పెద్దకోను సాని మనుమరాలయినట్టియు, నూతనముగ రజస్వలయయి విటలోకమునంతయు నట్టుడి కినట్లువేధించునట్టియుఁ, బ్రసిద్ధ కీర్తిస్వరూపిణియు నగు చిన్నకోనసాని దేహపరిమళసౌభా గ్యమునకై సంకల్పింపఁబడి నటకులలో నొకనిచే వినరి వైవఁబడిన కర్రడబ్బిలోని యత్తరువు సీస ప్రక్కను గూరుచున్న రక్షకభటాధికారివితంతుపుత్రికయొక్క నున్నని తలపై లింగముమీఁదఁ జుట్టపీఁక పడినట్టు పడుటచే నీగడబిడ జరిగిన దని తెలిసినది. ఇంతలో దలపగిలినధ్వనియును, మొర్రో యను కేకలును వినఁబడుడుటచే నేను దహతహపడితిని గాని కొబ్బెరకాయను గొట్టి లోననటకులు దేవిని బ్రార్థించుచుఁ బాడుచున్నా రని తెలిసి నాలో నేను నిమ్మళపడితిని. ఇఁక వేళపాకువేసము వచ్చునని నా ప్రక్కను గూరుచున్న యొకనాయండు-నాయీదువాఁడు ఉబలాటముతోఁ జంకలుఁ గొట్టుకొనుచుండెను. లోనిగంట గణగణ