4. సారంగధర నాటక ప్రదర్శనము
జంఘాలశాస్త్రి, సారంగధర నాటక ప్రదర్శనం చూసే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ ఉత్సాహంగానే, కర పత్రంలో నాటక ప్రదర్శన ప్రారంభం సరిగ్గా తొమ్మిది గంటలకే అని ,అచ్చయి వున్నందున - నాటకశాలకు వెళ్లాడు.
అయితే - ప్రదర్శన ప్రారంభం దేవుడెరుగు; వేషధారులింకా సిద్ధమే కాలేదు. వారి వారి మధ్య అంతర్గత కలహాలను కూడా జంఘాలుడు విని, చూడవలసి వచ్చింది. అలాగే ప్రదర్శనం చూడవచ్చిన ప్రేక్షకుల వైఖరికూడా ఎంత 'రసవంతం' గా వుందో, కంటితో చూశాడు
మొత్తంమీద ఎలాగైతేనేం సారంగధర నాటక ప్రదర్శనం ప్రారంభమైంది. ప్రతి రంగంలోనూ పాత్రధారుల నటన, కీర్తనల ధోరణి, ఎంత 'బీభత్సంగా ఉంటాయో వర్ణించి - జంఘాలశాస్త్రి ఒక అద్భుతమైన మాట అననే అన్నాడు - కన్నున్న వాడికి, మెదడున్న వాడికి, హృదయమున్న వాడికి, ఇంతకంటె భయ బీభత్స ప్రదమైన దర్శనమేదీ లేదు" - అని.
ఈ విశేషాలు చెప్తుంటే వాణీదాసు కలుగజేసుకుని - నాటకాలు వచనంలో తప్ప, వాటిలో పద్యాలుండకూడదా? అని ప్రశ్నించాడు. అలాగ నాటక సాహిత్యం గురించి జంఘాలుడు నోరు చేసుకోవలసిన అవసరం ఇంకా ఏర్పడింది. -
జంఘాలశాస్త్రి యిట్లుపన్యసించెను.
నిన్నను నేను నాటక ప్రదర్శనదిదృక్షాయత్తుఁడనై నాటకశాలకు రాత్రి తొమ్మిదిగంటలకుఁ బోయితిని. గ్రాముమునఁ బంచిపెట్టఁబడిన నాటకీయ కరపత్రములలో సరిగాఁ దొమ్మిదిగంటలకు నాకట సూరంభ మగునని వ్రాయఁబడియుండుటచేత నావేళకే పోయితిని. చమురు డబ్బామూఁత సూడఁదీయుటకై దానిమీంచ బీడుక, నిప్పుపెట్టి చాఁకలివాఁడు కాఁబోలు "సుఫ్ ఉఫ్” మనుచున్నాఁడు. నాటకరాజు కూరుచుండు కాకిబంగారు సింహాసనమున కూడినకా లదుకుచుఁ గుమ్మురి కాఁబోలు టక్కుటక్కు మనుచున్నాఁడు. ఎరవు దెచ్చిన బల్లలకుఁ గుర్చీలకు సడుగునఁ బేళ్లను, నాటకరంగాధ్యక్షుఁడు కొఁబోలు మసిబొగ్గుతోఁ బఱపఱ జాడించుచున్నాఁడు. అదివఱకు రాతిపై నూరినకత్తిని దోలుము