పుట:సకలనీతికథానిధానము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

సకలనీతికథానిధానము


వ.

కొంతకాలంబునకు నాస్థలంబు నిర్మానుష్యంబై యడవి పెరిగిన నొక్క భూసురుండు.

347


ఆ.

చెట్టుగొట్టి చేనుచేసి నాఁగటదున్ని
గొజ్జు గొట్టి నడిమిగుట్ట లేరి
[1]సవర జేసి గోరుతగాగజేశిని శాఖ (?)
విత్తులలికి కంచెవెలుగు వెట్టి.

348


క.

మిడుతులకు దప్పిచాలే
ర్పడ బాయఁగ పెఱిగి పేనువట్టకవలమై
సుడి చావక యెలుకలచే
బడినొవ్వక జొన్న పెఱిగి పండగనంతన్.

349


శా.

ధారాపట్టణ మేలు భోజుఁడు మహోదారుండు వాహ్యళిగా
నారణ్యంబున కేఁగివచ్చునెడ బ్రహ్మప్రాప్తభూయోవనో
చారంభస్థలి[2] జేరువం జనఁగ సైన్యవ్రాతముం జూచి య
ప్పారుం డిట్లనె జొన్నచొచ్చివలెనేభక్షింపుడీ బియ్యమున్.

350


క.

అని మంచెమీఁదఁ బలుగక
విని నిజమని జొన్నవెన్ను విరువగ మంచం
బును డిగ్గి వెంటదొలంగం
జని కుయ్యో యనిన సైన్యజను లతిభీతిన్.

351


ఆ.

చేను వెడలిపోవ దా నెప్పటిని మంచె
యెక్కి వెడలిపోవ నేల మీకు
నూచబియ్యమైన నోపినలాగున
దిను డనంగ వారు తిరిగి చొరగ.

352
  1. సవరచేసి గొరుత చదునుకాగ విశాఖ
  2. భూయోవనైకారంభస్థలి