పుట:సకలనీతికథానిధానము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

211


క.

ఖలజనుల తోడఁ బుట్టినఁ
గలిసినఁ జిత్తంబు లెనసి కదియకయుండున్
జలములనె పుట్టి పెరిగిన,
నలతామర పాకునీట నంటని భంగిన్.(?)

136


క.

చులుకనివారలఁ గూడిన
చులుకదనంబగును స్థిరవిశుద్ధాత్ములకున్[1]
శిల లటు వరదల సంగతి
జలములలోఁ దేలినట్లు చర్చింపంగన్.

137


క.

విఱుగంగఁ దగదు భటునకు
విఱుగంగాఁ జెల్లు భూమివిభునకు నాజిన్
విఱిగినను బసిఁడికలశము
గొఱయగు మృద్ఘటము విఱిగి కొఱమాలదొకో.

138


ఆ.

చందురుండు మిగులచల్లనివాఁడన
విరహిజనుల కెట్టు వెట్టయయ్యె!
అట్లు గాన మనుజుఁ డందఱికిని నొక్క
చందమున నేభక్తి జరుపఁగలఁడె.

139


క.

సేయఁదగునట్టి పనికిని
జేయనుపాయంబు సఫలసిద్ధి వహించున్
వేయేల! కాకతాళ
న్యాయం బగుఫలము ప్రాప్తమగు నరుకరణిన్.

140


క.

పరికింపఁ బురుషునకుునా
భరణము ధైర్యంబు, యతికిఁ బదవియె యోగా
భరణంబు శాంతి, స్త్రీ కా
భరణము లజ్జాగుణంబు భావింపంగన్.

141
  1. కదియక్రగుణిన్