పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మీ తప్పు ఏముందని ఆయన నవ్వుతూ అన్నారు. అష్పాఖ్‌ నోట వెంట ఆ మాటలు వెలువడగానే, అధికారుల కంట కన్నీరుబికింది.అష్పాఖ్‌ ఉన్న పళంగా లేచి నిలబడ్డారు. నేను తయారుగా ఉన్నాను అంటూ ఖురాన్‌ గ్రంథాన్ని భుజానికి వేలాడదీసుకున్నారు. అధికారులు వెంట రాగా లబ్బైక్‌ పలుకుతూ ఉరి వేదిక వద్దకు బయలుదేరారు.

ఆ సమయంలో అష్పాఖుల్లా ఖాన్‌ ఎలా ఉన్నారన్నవిషయాన్నిసర్దార్‌ భగత్ సింగ్ వివరిస్తూ, ..కురానె షరీఫ్‌ కట్టి ఉంచిన చిన్న సంచిని వేలాడదీసుకుని హాజీలాగా పారాయణం చేస్తూ ఎంతో ధైర్యంగా ముందుకు నడిచాడు. ముందుకు నడిచి ఉరి కంబంపైన తాడును ముద్దు పెట్టుకు న్నాడు. ఉరి వేదికవద్ద తనకు ఎదురుగా ఉన్న వ్యకులను ఉద్దేశించి, నేను ఎవరి రక్తంతోనూ నా చేతులు కళంకితం చేసుకోలేదు. నా విచారణ దేవుని ముందు జరుగుతుంది. నాపై మోపిన నేరాలన్నీ అబద్ధాలు, అని అష్పాఖుల్లా ఖాన్‌ అన్నారు అని పేర్కొన్నారు. (జ్ఞాపకం చేసుకోండి..: పేజి. 40-41)

ఉరిశిక్ష అమలయ్యేంత వరకు ఆయన చిరునవ్వుతో ఉన్నారు. మాతృదేశాన్ని బానిసబంధనాల నుండి విముక్తం చేయాలన్న ఆయన దృఢసంకల్పంలో చివరి వరకు ఏమాత్రం సడలింపులేదు. చివరకు ఉరికంబం ఎక్కినాక, ఉరిత్రాడు బిగించబోతున్న సమయంలో కూడా, నా మాతృభూమిని విముక్తం చేయాలనుకున్నాను. ఈ ప్రయత్నం నా జీవితం అంతం కావటంతో సమసిపోదు, అని ఆయన ప్రకటించారు.

(Just before the noose was put round his neck, he said, " I tried to make India Free, and the attempt will not end with my life ",. -The History and Culture of The Indian People Vol. XI,(Struggle for Freedom) Edited by RC Majumdar, Bharathiya Vidya Bhavan, Bombay, 1969, Page 546).

ఈ మేరకు ఆయన కవితలు కూడా అల్లారు. ఆ కవితల్లో, నా హిందూస్థాన్‌కు స్వేచ్ఛ లభిస్తుంది చూడండి. చాలా త్వరలోనే బానిసత్వపు సంకెళ్లు తెగిపోతాయి (బహుత్‌ సీ జల్ద్‌ టూటేంగి గులామికి జంజీరే. కిసీ దిన్‌ దేఖనా ఆజాద్‌ ఏ హిందూస్థాన్‌ హోగి) అని తన ప్రగాఢ కాంక్ష వ్యక్తం చేసారు.

ఉరివేదిక మీద నుండి ఉరితాడును గౌరవంగా స్వీకరించారు. ఆ ఉరిత్రాడు మెడలో పడ్డాక, దైవ నామస్మరణ ప్రారంభించారు. ఉరితాడును ముద్దు పెట్టుకున్నారు. ఎదురుగా నిలుచున్న వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ నా చేతులు ఎవరి రక్తంతో

68