పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

మలినం కాలేదు. నా మీద చేసిన అరోపణలు అబద్దం. భగవంతుడు నాకక్కడ న్యాయం చేస్తాడు. అంటూ ఉరిశిక్షఅమలుకు సిద్ధమయ్యారు.

అధికారుల నుండి తలారికి సంజ్ఞ అందగానే ఉరిశిక్ష అమలు జరిగింది. ఉరితాడు అష్పాఖ్‌ మెడకు బిగుసుకుంది. భరతమాత ముద్దుబిడ్ద ప్రాణాలు అనంతవాయువులలో కలిసి పోయాయి. మాతృభూమి కోసం మరణాన్ని ఆనందంగా ఆహ్వానించిన విప్లవకారుడు అష్షాఖ్‌ తానుపుట్టి న గడ్డ పట్ల గల ప్రేమాభిమానాలను వ్యకంచేస్తూ తనను మట్టి చేసేటప్పుడు తన కఫన్‌ లో (మతుృలను సమాధి చేసేందుకు ముస్లింలు బౌతికకాయాన్ని చుట్టి ఉంచే ధవళ వస్త్రం) మాతృభూమి మట్టిని ఉంచుమని కవితాత్మకంగా తన కోర్కెను ప్రకటించారు. అంతిమయాత్రలో కూడా జన్మస్థలానికి దూరం కావడానికి ఇష్టపడని అష్పాక్‌ పుట్టి పెరిగిన ఊరి మట్టితో, ఆమట్టిలో కలసిపోవాలన్న ప్రగాఢ కాంక్షను వ్యక్తం చేశారు. ఆ కవిత ఇలా సాగింది.

నాకే కోరికా లేదు. ఉన్నదల్లా ఒక్కటే కోరిక. ఎవరైనా నా శవవస్త్రం మీద నేను పుట్టిన గడ్డ మట్టి ఉంచాలని తప్ప. ( కుచ్‌ ఆర్జూ నహీ హై, హై ఆర్జూతో యహ్‌ హై,- రఖ్‌ దొ కోయీ జరా సీ ఖానే వతన కఫన్‌ మే)

అష్పాఖ్‌ను ఉరితీసే రోజున ఫైజాబాద్‌కు ప్రజానీకం తరలివచ్చారు. ఉరి కార్యక్రమం జైలులో జరుగుతుండగా, భరతమాత ముద్దుబిడ్డ అష్పాఖుల్లా ఖాన్‌కు జోహార్లు పలుకుతూ, జైలు పరిసర ప్రాంతాలనే కాకుండా, ఫైజాబాద్‌ పట్టణమంతా నినాదాలతో ప్రతిధ్వనింపజేసారు. ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత ఆయన బందువులు అష్పాఖ్‌ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన షాజహాన్‌పూర్‌కు తీసుకువెళ్లారు.

అమర వీరుని అంత్యక్రియలు

ఆ రోజుల్లో విపవకారులంటే ప్రబుత్వం ఎంతగా భీతిల్లిందంటే, ఉరిశిక్ష విధించాక కూడా ఆ ఆమర వీరుల భౌతికాయాలను సంబంధితుల పరం చేసేదికాదు. ఆ కారణంగా అష్పాఖుల్లా తన కుటుంబీకులకు రాసిన లేఖలో నా భౌతికకాయాన్నిఅందిస్తారో లేదో అన్నా అనుమానం వ్యక్తం చేశారు. ఆ విషయాన్నిప్రస్తావిస్తూ, నా భౌతికకాయాన్ని మీకు అందచేస్తారో లేదో నాకు తెలియదు. ప్రాణం పోయాక శరీరం మట్టిదిబ్బ మాత్రమే , అని అష్పాఖ్‌ ప్రకటిస్తూ, తన బందుమిత్రులను ముందస్తుగా సముదాయించారు. ఈ రకంగా చూస్తే అష్పాఖ్‌ మరణాన్నిచాలా తేలిగ్గా తీసుకున్నట్టు తెలుస్తుంది.

69