పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

సత్యసందుడు, ధైర్యవంతుడు అంటారు, అని రాశారు.(Sudhir Vidhyardhi:Page.101)

ఈ కాకోరి కసులో ఆయన సహచరు డు శ్రీ శచీంద్రనాథ్‌ బక్షి సోదరి, విప్లవకారిణి నళినికి 1927 డిసెంబరు 16వ తేదిన రాసిన లేఖలో, .. నేను మరణించపోతున్నాను. అంతకన్నా ఇలా అంటే బాగుంటుందే మో . వాసవానికి నేను అమరత్వం పొందబోతున్నాను... వచ్చే సోమవారం నా జీవితానికి చివరి రోజు కాబోతోంది....నేను వీర మరణం పొందబోతున్నాను, (ప్రజాసాహితి: పేజి 54-55) ఆని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ విధగా ఓ మహత్తర లక్ష్యంకోసం ఉరిశిక్షను స్వీకరించటం మహాద్భాగ్యంగా భావించిన అష్పాఖ్‌ మాతృదేశం కోసం మరణ వేదికనెక్కటం గర్వించదగిన అవకాశంగా భావించి, ఆ క్రమంలో తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఉరిశిక్ష అమలు కోసం ఎదురు చూడసాగారు.

ఉరిశిక్ష అమలుకు ఎదురుచూపు

ఉరిశిక్ష ఖరారయ్యాక ఆ శిక్ష అమలు కోసం అష్పాఖ్‌ ఎదురుతెన్నులు చూడ సాగారు. ఉరిశిక్ష తనకు లభించిన మహత్తర అవకాశంగా భావించినందున, ఆ శిక్షతో ప్రయోజనం పొందాలని ఆయన భావించారు. తనను త్వరితంగా ఆంగ్లేయ ప్రభుత్వం ఉరి తీయాలని, తద్వారా ప్రజల గుండెలు మండాలని, మండిన గుండెల నుండి ఎగబ్రాకిన బడబాగ్నులలో బ్రిటిషర్లు మాడి మసెపోవాలని ఆయన కోరుకున్నారు. ఆయన ఉరిశిక్షను చాలా చిన్నవిషయంగా భావించారు. ఆయనను చూడడానికి వచ్చిన బంధు మిత్రులతో, ఉరి కొయ్య మీద ఉయ్యాల ఊగే సుందర స్వప్నాని అనునిత్యం దర్శిస్తున్నానని అన్నారు.

అష్పాఖ్‌ను చివరిసారిగా చూసేందుకు న్యాయవాది శ్రీ కృపాశంకర్‌, హజేలా, అష్పాఖ్‌ అన్నదమ్ములు, అన్న కుమారులు డిసెంబరు 17 న జైలుకు వచ్చారు. అప్పుడే స్నానం చేసి శుభ్రమై బట్టలు ధరించిన ఆయన జైలు సెల్‌లోకి వెడుతూ, చిరునవ్వుతో అత్మీయులకు అభివాదం చేశారు. అప్యాయంగా బంధుగణాన్ని పలకరించారు. ఉరిశిక్షకు

ఎదురు చూస్తున్న ఆయన ఏమీ జరగనట్టు వ్యవహరించారు. ఆయన పలకరింపుతో గుండెచెదరిన ఆయన సోదరులు, ఆ సోదరుల కుమారులు గుండెలు పగిలేట్టుగా విలపించసాగారు. ఆ దృశ్యం అష్పాఖ్‌కు చిరాకు కలిగించింది.

63