పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మాతృభూమి కోసం మరణించే మహత్తర అవకాశం లభించినందున ప్రతిఒక్కరూ సంతోషించాలన్నారు. ఓ లక్ష్యం కోసం మరణించే అదాష్టం పొందిన కొడుకును చూసి ప్రతి తల్లీ గర్వించాలన్నారు. ఈ మేరకు ఆయన తన సోదరులు మహమ్మద్‌ రియాసతుల్లా, తల్లి మజహరున్నీసాలకు రాసిన లేఖలలో ఆయనలోని నిర్భయత్వం వెల్లడవుతుంది.

ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాదు జైలు గోడల మధ్య నుండి ఆయన తన తల్లికి రాసిన ఒక లేఖలో, ఆమ్మా..నీ బిడ్డడు వీరోచితంగా మరణాన్ని స్వీకరిస్తున్నందుకు నీవు గర్వించాలి. మృత్యువుతో పోరాడాల్సి వస్తే నీవు కూడా అత్యంత ధైర్యాన్ని ప్రదార్శించి, ఓ యోధుని తల్లిగా నిన్ను నీవు రుజువు చేసుకోవాలి...భయం కలిగించే మాటలను కూడ అతి తేలిగ్గా తీసుకుంటున్నానంటే అదంతా మీ ఉగ్గుపాల మహిమ...మీరు వదినతో వచ్చేట్టయితే గతంలో వచ్చినట్టు ధైర్యశాలిగా రాగలవు. నన్నూ ధైర్యశాలిని చేయాలి, ఆని రాశారు. (Sudhir Vidhyardhi: Page. 86)

అమ్మా నీవు వీరమాతవు. వీరమాతలు దు:ఖించరాదని తల్లికి ధైర్యం చెప్పారు. మరణం ఎవరికైనా తప్పదు. అయితే అటువంటి మరణం ఒక సదాశయాన్నిసాధించే క్రమంలో లభిస్తే సంతోషించాలన్నారు. నా దేశం కోసం నేను మరణంచటం గర్వించదగిన విషయం. ఎవరికైనా ఇంతకంటే గొప్ప వరం ఏముంటుంది? నా వంశంలో నా తల్లి కంటే గొప్పవారు ఎవరుంటారు? అంటూ తల్లిని అష్పాఖ్‌ ఊరడిస్తారు. అంతేకాదు ఆయన పలువురికి రాసిన లేఖలలో, నేను వీరగతిని పొదాుతున్నాను. మాతృదేశం కోసం బలయ్యేవారు అదృష్టవంతులు. అంతకంటే అదృష్టవంతులు ఎవరుంటారు?.... మాతృదేశాన్ని ప్రేమిస్తున్నందుకు నాకు మరణశిక్ష విధించారు.అందుకు నేను గర్విస్తున్నాను, అని పేర్కొంటూ, మృత్యువుకు ఏ మాత్రంవెరవని ధీరోదాత్తుడుగా అష్పాఖ్‌ దర్శనమిస్తారు .

అష్పాఖుల్లా ఖాన్‌ న్యాయవాది శ్రీ హజేలా, ఆయన సన్నిహితులు ఆయన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రభుత్వంతో సహకరించమన్నప్పుడు, ఆ సలహాలను తిరస్క రిస్తూ తన తల్లికి రాసిన లేఖలో, నేను నా ప్రాణాలు కాపాడుకునేందుకు, ఇతరులను ఈ కేసులలో ఇరికించేందుకు అప్రూవర్‌ కాగలను. ఈ మేరకు ప్రభుత్వానికి సహకరించ గలను. తన జిందగీ కోసం ఇతరుల బ్రతుకులను ఇక్కట్ల పరం చేయగలంతటి అత్యంత నీచమైన చర్యలకు పాల్పడిన వ్యక్తి భవిష్యత్తు తరాలకు ఏవిధంగా ఆదర్శనీయుడు కాగలడు? కాడు ఎప్పుడు కాలేడు... నాకు గర్వంగా ఉంది రానున్న తరాలు నన్ను పిరికిపందఅనవు. నీచుడు అని నన్ను అవును....నిశ్చయంగా అనవు. నన్ను

62