పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

ఈ మేరకు ఒక సంవత్సరం పాటు బ్రిటిష్‌ పోలీసుల, గూఢచారుల కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతూ, ప్రభుయత్వానికి సవాలుగా మారిన అష్పాఖ్‌ అరెస్టు కావడంతో కాకోరి రైలు సంఘటనలో పాల్గొన్న యోదులలో ఒక్క చంద్రశేఖర్‌ అజాద్‌ తప్ప శచీంద్ర బక్షీతో సహా అందరి అరెస్టులు పూర్తయ్యాయి.

కాకోరీ రైలు సంఘటన యోధులకు శిక్షలు

చరిత్రాత్మక కాకోరీ రైలు దోపిడి సంఘటనలో పాల్గొన్నవిప్లవకారుల మీద లక్నోలోని రింగ్ థియేటర్‌లో విచారణ ప్రారంభమైంది. ఈ కేసును ప్రభుత్వం ఒక సవాలుగా స్వీకరించింది. విప్లవకారులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలి పెట్టదలచుకోలేదు. ప్రభుత్వం సుప్రసిద్ధ న్యాయవాదులను నియమించుకుంది.

ఈ విచారణ ప్రారంభమయ్యేనాటికి అష్పాఖుల్లా ఖాన్‌, శచీంద్రనాథ్‌ బక్షీ, చంద్రశేఖర ఆజాద్‌లు అరెస్టు కాలేదు. ఆకారణంగా ఈ ముగ్గుర్ని తప్పించి మిగిలిన ఆందారి మీద కేసులు నమోదు చేసి ప్రభుత్వం విచారణకు పూనుకుంది. ప్రధాన కేసు విచారణ ఆరంభమైంది. అష్పాఖుల్లా, శచీంద్రనాధ్‌, అజాద్‌ ల మీదకేసును వేరు చేసి అనుబంధ కేసును తయారు చేసింది. ఆ కేసును వేరుగా విచారించింది.

న్యాయస్థానంలో ప్రదాన కేసు విచారణ ఒకటిన్నర సంవత్సరం సాగింది. మూడు వందలమంది సాక్షును విచారించారు. ప్రభుత్వం పదిలక్షల రూపాయలను వ్యయం చేసింది. చివరకు 1927 ఏప్రిల్‌ 6వ తేదీన న్యాయమూర్తి హ్యామిల్‌టన్‌ తీర్పు చెప్పారు. ఆ తీర్పు ప్రకారం రాంప్రసాద్‌ బిస్మిల్‌, రాజేంద్ర లహరి, ఠాకూర్‌ రోషన్‌సింగ్ లకు ఉరిశిక్ష, మిగిలిన వారికి వివిధ రకాల శిక్షలు పడ్డాయి. ఈ శిక్షలు విధించిన న్యాయమూర్తి తీర్పు పాఠం కోరులో విన్పించిన తరువాత, విప్లవకారులు ఏదైనా చర్యకు పాల్పడవచ్చని భయపడి ఇంగ్లాండ్‌ వెళ్ళిపోయాడు. ఈ కేసు ప్రజలను ఉత్తేజితుల్ని చేసింది. అప్పటి వరకు దేశ రాజకీయాలలో ఆవరించి ఉన్నస్తబ్దతను దూరం చేసింది. కాకోరి వీరుల స్పూర్తితో పరాయి పాలకుల మీదాప్రజల నిరసన వెల్లువెత్తింది.

ప్రలోభాలకు లొంగని ధీరుడు

అష్పాఖుల్లా ఖాన్‌ను అరెస్టు చేశాక, సహచరుల గురించి, విప్లవోద్యమం గురించి, రహస్యాలను చెప్పమంటూ పోలీసులు చిత్రహింసలు ప్రారంభించారు. కాకోరి రైలు

53