పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

దోపిడి సంఘటనలో అఫ్పాఖ్‌తోపాటుగా పాల్గొన్న శ్రీ బన్వారిలాల్‌ ప్రభుత్వహింసకు, ప్రలోభాలకు లొంగిపోయాడు. విప్లవదళం వివరాలను బయటట్టి ఆయన అప్రూవర్‌ గా మారిపోయాడు. శ్రీ బన్వారిలాల్‌ లాగే అష్పాఖ్‌ కూడ లొంగిపోతాడని భ్రమించిన పోలీసు అధికారులు ఎన్నిఎత్తులు వేసినా, ఆయన నుండి ఎటువంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు.

ఆ మార్గంద్వారా ఫలితాలు రాబట్టలకపోయిన పోలీసులు తమ బాట మార్చారు. అష్పాఖ్‌కు ఆశపెట్టి, ప్రలోభాలతో మభ్యపెట్టి అప్రూవర్‌గా మార్చుకుని, విప్లవోద్యామాన్ని దుంపనాశనం చేయాలని పన్నాగం పన్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగా, అష్పాఖ్‌ బంధువులు, మిత్రులను రప్పించి, వారికి నచ్చ చెప్పి, భయపెట్టి ఆయన మీద ప్రయోగించారు. అష్పాఖ్‌ కనుక పోలీసులకు విప్లవోద్యమ వివరాలు చెబితే చాలన్నారు. ప్రభుత్వంతో సహకరిస్తే ఉరిశిక్ష తప్పిపోవటమేకాక, సుఖవంతమైన జీవితానికి ఏర్పాట్లు చేయిస్తామన్నారు. ఉరిశిక్షలకు భయపడి, విప్లవ విద్రోహానికి పాల్పడమని హితవు పలుకుతూ, ప్రభుత్వం-పోలీసుల ప్రతిపాదనలతో తన వద్దకు వచ్చిన మధ్యవర్తులను, బంధుమిత్రులను అష్పాఖ్‌ చీదరించుకున్నారు.

అప్పికీ పోలీసులు తమ ప్రయత్నాలను మానుకోలేదు. డిప్యూటీపోలీసు సూపరిండెంట్ తస్సద్దిఖ్‌ హుస్సేన్‌ ను ప్రభుత్వం ప్రయోగించింది. ఆయన ద్వారా అష్పాఖ్‌ను లొంగదీయాలని భావించింది. ఆయన అష్పాఖ్‌కు నచ్చచెబుతూ, రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఒక హిందువు. ఆర్యసమాజీకుడు. దేశంలో హిందూ రాజ్యం నెలకొల్పడం వాళ్ళ ధ్యేయం. అది ముస్లింల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్దమైనది. ఒక ముస్లింగా నీవు వారి మతతత్వాన్నినిరసించి, ప్రభుత్వంతో సహకరించు, కాఫిర్లతో సహకరించడం మన మత సంప్రదాయాలకు పూర్తిగా విరుద్దం కాబట్టి ఒప్పుదాల వాంగ్మూలం ఇచ్చి నీ ప్రాణాలను, అలాగే నీ మతం ప్రయోజనాలను కాపాడుకో, (బిస్మిల్‌ ఆత్మకథ : పేజి 151) అంటూ అష్పాఖ్‌ను మార్గం మళ్ళించేందుకు శత విధాల ప్రయత్నించాడు.

అష్పాఖుల్లాను లొంగదీసుకునేందుకు ఆ పోలీసు అధికారి మత మనోభావాల ఆసరా తీసుకున్నాడు. తాను ముస్లిం కనుక అష్పాఖ్‌ మేలు కోరుకుంటున్నందున తన మాట తప్పక వినమన్నాడు. ప్రభుత్వాన్ని ఒప్పించి మేలు చేస్తానని హామీల వర్షం కురిపించాడు. పోలీసు అధికారి హితవును చిరునవ్వుతో అష్పాఖుల్లా ఖాన్‌ విన్నారు. ఆ హితవచనాలు సాగుతున్న సందర్బంగా, హిందూ రాజ్యస్థాపన అంటూ తస్పద్దిఖ్‌ హుస్సేన్‌ వాడిన మాటలకు సమాధానంగా అష్పాఖుల్లా మాట్లాడుతూ, మీరు నా క్షేమం కోరి

54