పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మిత్రద్రోహం వలన అరెస్టు

అష్పాఖ్‌ రష్యా వెళ్లడానికి ఢిల్లీలో ఉంటూ తగిన ప్రయత్నాలు చేసుకుంటుండగా, ఒక రోజున స్వగ్రామానికి చెందిన ఆయన చిన్ననాటి మిత్రుడు సయ్యద్‌ హబీబ్‌ అహ్మద్‌ కన్పించాడు. మిత్రులిరువురు చాలా కాలం తరువాత కలుసు కొన్నందుకు సంతోషించారు. స్వగ్రామంలోని బందుమిత్రుల క్షేమసమాచారాల గురించి ఇరువురు మిత్రులు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో సయ్యద్‌ హబీబ్‌ తన మిత్రుడి రష్యా ప్రయత్నాల గురించి తెలుసుకున్నాడు.

అష్పాఖుల్లా ఖాన్‌ ఢిల్లీలో ఉన్న విషయం, ఆయనను తాను కలసిన వైనం సయ్యద్‌ హబీబ్‌ అహ్మద్‌ స్వగ్రామంలోని తన తండ్రి సయ్యద్‌ ముస్తాఖ్‌ ఆహమ్మద్‌కు తెలిపాడు. ఆతండ్రి కొడుకులకు సంబంధించి పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. రౌడీషీటు కూడా పోలీసులు తెరచి ఉన్నారు. అటు ప్రభుత్వంఇటు పోలీసుల నుండి ఆ తండ్రీ కొడుకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆ కారణంగా ఆ ఇబ్బందుల ఝంజాటనం నుండి విముక్తం కావటమే కాకుండా, ప్రబుత్వం ప్రకంచిన నజరానా పొందటంతోపాటు ప్రబుత్వాధికారుల మన్నన పొందేందుకు అష్పాఖ్‌ మంచి ఉపయుక్త సాధనంగా సయ్యద్‌ ముస్తాఖ్‌ అహమ్మద్‌కు తోచింది. అష్పాఖ్‌ను పట్టిస్తే ప్రభుత్వనజరానా పొందవచ్చని, అధికారుల అనుగ్రహం సంపాదించి తమ మీద ఉన్న కేసులను ఉపసంహరింప చేసుకోవచ్చన్న ఆశ పుట్టింది. ఆ విషయాన్ని కుమారుడు సయ్యద్‌ హబీబ్‌ అహమ్మద్‌కు ఆయన తెలిపాడు. అష్పాఖుల్లా మీదకన్నేసి ఉంచమని, ఎటువంటి అనుమానం రాకుండా వ్యవహరించమని కుమారుడికి సలహా ఇచ్చాడు. అష్పాఖ్‌ ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుని ఆ వివరాలను సమయం చూసి పోలీసులకు చేరవేయాల్సిందిగా ఆయన సూచించాడు.

ఈ మేరకు తండ్రి కొడుకులు చర్చించుకుని అష్పాఖుల్లాను పోలీసులకు పట్టివ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారంగా అఫ్పాఖ్‌ ఉంటున్న గది రహస్యాన్ని తెలుసుకున్న సయ్యద్‌ హబీబ్‌ అహ్మద్‌ ఆ సమాచారాన్ని పోలీసులకు తెలిపాడు. ఆ విషయం తెలియని అష్పాఖ్‌ ఆ నమ్మక ద్రోహి మిత్రునితో కలసి భోజనం చేసి తన గదికి వెళ్ళారు. ఆయన ఎప్పటిలాగే తన గదికి చేరుకున్న మరుక్షణమే, పొంచి ఉన్నపోలీసు బలగాలు భారీ సంఖ్యలో వచ్చి ఆ ప్రదేశాన్ని చుట్టు ముట్టాయి. మిత్రుడి నమ్మక ద్రోహం గురించి తెలుసుకుని అష్పాఖుల్లా అప్రమత్తమయ్యేలోగా, ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

52