పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

మరికొద్ది నిమిషాలలో ఉరితీస్తారనగా కూడాఆయన కవిత్వం చెప్పారు. ఉరివేదిక మీద నుండి కూడా ఉర్దూ కవితలు విన్పించటం విశేషం.

అష్పాఖుల్లాచే విరచిత కవితలలో కొన్ని...

ఓ నా మాతృదేశమా సదా నీకు సేవచేస్తూనే ఉంటాను. ఉరి శిక్ష పడినా, జన్మఖైదు విధించినా, బేడీల దరవుతో నీ నామస్మరణ చేస్తూనే ఉంాను. (హే మాతృభూమి తేరీ సేవా కియా కరూంగా, ఫాంసీ మిలే మరేఖ యా హో జన్మ ఖైద్‌ మేరీ. బేడి బజా బజా కర్‌ తేరా భజన్‌ కరూంగా).

నా మాతృభూమి కలకాలం స్వత్రంతంగా ఉండాలి. నా దేముంది నేను ఉండొచ్చు, ఉండక పోవచ్చు. (వతన్‌ హమేశా రహే సదా ఖాయం ఔర్‌ ఆజాద్‌ - హమారా క్యా హై అగర్‌ హమ్‌ రహే రహే నా రహే)

సహించలేక వారి ఆన్యాయాలూ, ఆత్యాచారాలు చూసి విసిగి పోయి- మేము సైతం ఫైజాబాద్‌ జైలు నుండి వెళ్ళిపోతున్నాము. (తంగ్ ఆకర్‌ హమ్‌ భీ ఉన్‌కే జుల్మ్‌ సే బేజార్‌ సే - చల్‌ దియే సూఏ ఆదం జిందా ఫైజాబాద్‌ సే.)

పిరికి వాళ్ళెప్పుడూ చావుకు భయపడుతూ, రోజుకు వందసార్లు మరణిస్తుంటే చూశా. వీరులెన్నడూ చావుకు భయపడగా చూడలేదు. పైగా మృత్యు వేదిక మీద సైతం నవ్వుతూ ఆడుతూంటే చూశా. (బుజ్‌దిలోంకో సదా మౌత్‌సే డర్‌తా దేకా, గోకీ సౌ బార్‌ ఉంహే మర్‌తా దేఖా, వీర్‌ కో మౌత్‌ సే హమ్‌ డర్‌తే నహీ దేఖా, తక్తాయే మౌత్‌ పర్‌భీ ఖేలాహి కర్తా దేఖా)

సమస్తమూ నశించి పోయేదే. రూపుమాసిపోయేది నేను ఒక్కణ్ణే కాదు. కేవలం దేవుడే నాశనము లేని వాడు. (ఫనా హై సబ్‌కే లియే హమ్‌ సే కుచ్‌ నహీ మౌకూఫ్‌, బకాహై ఏక్‌ ఫకత్‌ జాన్‌-ఎ-కిబ్రియోం కేలియే)

అతి త్వరలోనే బానిసత్వపు బంధనాలు తెగిపోతాయి. ఆరోజు చూడండి హిందూస్థాన్‌ ఆవుతుంది స్వతంత్రం.

49