పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఉద్యమ స్పూరిని పండించిన ఉర్దూ కవి

అష్పాఖుల్లా ఖాన్‌ గొప్ప విప్లవకారుడు మాత్రమే కాదు, మంచి ఉర్దూ కవి కూడా, ఆయన తల్లి శ్రీమతి మజహరున్నీసా ఉర్దూ సాహిత్యాభిలాషి. మంచి చదువరి కావడం వలన చిన్నతనం నుంచి అష్పాఖుల్లాకు ఉర్దూ సాహిత్యం మీద మమకారం ఏర్పడింది. కవితలను రాయడం ప్రారంభించారు. హసరత్‌ అని కలంపేరు పెట్టుకు న్నారు. హసరత్‌ అంటే లాలస అని అర్ధం. ఆయన వారసీ అని మరోపేరుతో కూడా కవితలను రాసారు. ఉర్దూ కవి సమ్మేళనాలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. మంచి ఉర్దూలో, బలనమైన భావాలతో సాగిన ఆయన కవితలు ప్రజలకు ఉతేజితుల్నిగావించేవి. ఆయన భావాలతో ఏకీభవించని వారు కూడా అష్పాఖ్‌ కవితలంటే చెవికోసుకునేవారు. శ్రీ పురుషోత్తం దాస్‌టాండన్‌ లాంటి ప్రముఖులు ఆయన సాహిత్యం అంటే బాగా ఇష్టపడేవారు.

ఉర్దూ భాషంటే ఆయనకు ప్రాణం. విప్లవోద్యమంతో తలమునకలైయున్నప్పుడు కూడా ఆయన ఉర్దూ కవితలు రాయటం మానలేదు. యువకులను విప్లవోద్యమంలో పాల్గొనేలా చేయగల ఉత్తేజపూరిత వ్యాసాలను శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ రాసిప్పుడు ఆ వ్యాసాలు ఉర్దూలో రాయటం వలన ఉర్దూ మాతృభాషగా గల ముస్లిం యువత కూడా ఆ ఆలోచనలతో ప్రభావితం కాగలరు కనుక ఆ వ్యాసాలను ఉర్దూలో రాయమని ఆయన బిస్మిల్‌ను కోరేవారు. ఈ విషయాన్ని స్వయంగా బిస్మిల్‌ ప్రస్తావిస్తూ, నే నెప్పుడైనా ఏదైనా వ్యాసం లేక పుస్తకం హిందీలో రాస్తే, అప్పుడల్లా నీవు ముస్లింలు కూడా చదావగలిగేందుకు గాను ఉర్దూలో ఎందుకు రాయకూడదని కోరుతుండేవాడివి, (బిస్మిల్‌ ఆత్మకథ, పేజి.106) అన్నారు.

ఉర్దూ కవిగా అష్పాఖుల్లా ఖాన్‌ రాసిన ఉర్దూ కవితలు, వ్యాసాలు పోలీసుల సోదాలలో చాలా వరకు పోగా, ఆయనింట జరిగిన దొంగతనంలో మరికొన్ని మాయం అయ్యాయి. ఆ కారణంగా ఆయన సృజించిన ఉర్దూ సాహిత్యం పూర్తిగా ప్రజలకు దక్కలేదు. ఆ కారణంగా ఉర్దూ కవిగా ఆయనను అంచనా వేయడానికి కుదరలేదు. అందినంత వరకు ఆయన గురించి అధ్య యనం చేసన సాహితీ విమర్శకులు అష్పాఖుల్లా ఖాన్‌ ప్రముఖ ఉర్దూ కవిగా ప్రశంసించారు.

ఆయన ప్రతి కవితలో మాతృభూమి పట్ల గల ప్రేమ, ఆంగ్లేయ ప్రభుత్వం పట్ల ఆగ్రహం, బానిస బ్రతుకుల నుండి బయటపడమన్న ప్రబోధం, ఆందుకు విప్లవించమని పిలుపు, బ్రతుకు గురించి, దేవుని గురించి తాత్విక భావనలు కన్పిస్తాయి. చివరకు

48