పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

(బహుత్‌ హి జల్దీహీ టూటేంగే గులామి కీ యే జంజీరేం- కిసీ దిన్‌ దేఖనా ఆజాద్‌ యహ్‌ హిందూస్తాన్‌ హోగా)

ఆమర జీవులు సమాధుల మీద ప్రతి ఏడు పూల మాలలు వేలాడుతాయ్‌. మాతృభూమి కోసం మరణించే వాళ్ళను గుర్తు చేసే దొక్కటే. (షహీదోం కే మజారోం పర్‌ లగేంగే హర్‌ బరస్‌ మేలే- వతన్‌ పర్‌ మర్‌నే వాలోంకా యహీ బాకీ నిషాని హోగా)

చావు ఒక రోజు తప్పక రానున్నదన్నప్పుడు ఎందుకు భయపడాలి. మేమెప్పుడు దానిని ఆటనుకున్నాం మరి చావెక్కడా. (మౌత్‌ ఏక్‌ రోజ్‌ ఆనీ హైతో డర్‌నా క్యాహై- హమ్‌ సదా ఖేల్‌ హీ సముఝూ కియే మరనా క్యా హై)

అష్పాఖుల్లా ఖాన్‌ రాసిన ఓ ఉత్తరంలో ఆయన రాసిన కవిత ఈ విధంగా ఉంది. ఆ లేఖలో, తోటలో పూల పంట లెస్సగా ఉంది. కానీ ఏమి లాభం? అందులో బుల్‌బుల్‌ ఉండటం, లేచి పోవటం తోటమాలి ఇష్టా ఇష్టాలతోనే కదా. ప్రేమ మార్గంలో చరించి సమసి కూడా సమసినవాడు కాడు-వల ఇందులో నిరపరాధే. పంజరం నిర్దోషియే. స్వయంగా నా రెక్కల్లో, ఈకల్లో మిళితమై ఉంది. బందీ కావాలనే ఆకాంక్ష. ప్రపంచోద్యాన సృషికర్త రాశాడు నా నొసట-పూల వసంతంలో తోట నుండి భహహ్కృతు డవై, బందీఖానాలో నివాసముండమని, పేర్కొన్నారు.

ఈ మేరకు అష్పాఖుల్లా ఖాన్‌ దేశభక్తి ప్రపూరితమైన కవితలను చాలా రాశారు. ఆయన కవితలు హందం అను ఉర్దూ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆయన పిల్లల కోసం పుస్తకం కూడా రాయాలనుకున్నారు. కాని ఆ కోరిక నెరవేర లేదు. ఆయన ఈ కవితలను ప్రదానంగా అజ్ఞాతంలో ఉన్నప్పుడు, ఆ తరువాత జైలులో ఉన్నప్పుడు రాశారు.

కాకోరి రైలు సంఘటన కేసులో ఉరిశిక్ష పడి, ఆ శిక్ష అమలు అయ్యేంత వరకు పైజాబాదు జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన రాసిన కవితలలో మాతృభూమిని బ్రిటిషర్ల బానిసత్వం నుండి విముక్తం చేయాలన్నబలమైన ఆకాంక్ష వ్యక్తమౌతుంది. ఉరిశిక్ష పడినా, యావజ్జీవిత ఖెదు ప్రాప్తించినా మాతృదేశమా నీ నామస్మరణ అనునిత్యం చేస్తూనే ఉంటానని అష్పాఖుల్లా ఖాన్‌ జైలు గోడల మధ్య నుండి ప్రకటించటం విశేషం.

50