పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నుండి మారు వేషంలో నేరుగా భోపాల్‌ వెళ్ళారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేక లక్నో మీదుగా కాన్పూరు వచ్చారు. అక్కడ ప్రతాప్‌ పత్రిక సంపాదకుడు, విప్లవాభిమాని శ్రీ గణేష్‌ శంకర్‌ విద్యార్థిని కలిసారు. ఈ ప్రతాప్‌ పత్రిక కార్యాలయం ఆనాడు విప్లవకారులకు ప్రదాన కూడలి కేంద్రంగా ఉండేది. సర్దార్‌ భగతసింగ్ తో పాటు పలువురు విప్లవకారులు ప్రతాప్‌లో వ్యాసాలు రాసేవారు. శ్రీ విద్యార్థి అష్పాఖుల్లా ఖాన్‌కు కొంతకాలం ఆశ్రయ మిచ్చి, అక్కడి నుంచి ఆయనను బెనారస్‌ పంపారు. బెనారస్‌ అనాడు విప్లవ కారులకు మంచి స్థావరంగానూ, కేంద్రంగా ఉంది. అక్కడకు వెళ్ళిన అష్పాఖ్‌ హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌కు చెందిన ఇతర సభ్యులతో కలసి బీహార్‌ వెళ్ళిపోయారు.

ఆ విధమ్గా బీహార్‌ వెళ్ళే ముందు పోలీసు అధికారుల కళ్ళుగప్పి అష్పాఖ్‌ స్వగ్రామం వచ్చారు. ఆయన అన్న రియాసతుల్లా ఖాన్‌ కదనం ప్రకారం, అష్పాఖుల్లాఖాన్‌ అలహాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం మూడు గంటలకు షాజహాన్‌పూర్‌ వచ్చారు. ఆయన సిక్కు యువకుని వేషంలో ఉన్నారు. ఆయన కోసం పోలీసు అధికారులు, సి.ఐ.డి. అధికారులు స్టేషన్‌ వద్ద కాపుకాసి ఉన్నారు. మారువేషంలో ఉన్నఆయనను పోలీసులు గుర్తు పట్టలేదు . ఆష్పాఖ్‌ స్టేషన్‌ నుంచి తిన్నగా మిత్రుడు 'అలీ ఖైరాదీ' ఇంటికి వెళ్ళారు. పెద్దన్న ముహమ్మద్‌ షఖీవుల్లా ఖాన్‌ను చూడలన్నారు. ఆయన వేట కోసం వెళ్ళి, అక్కడ జరిగిన ప్రమాదంలో తుపాకి తూటా తగిలి 15 రోజుల క్రితం చనిపోయారని మిత్రుడు తెలిపారు. ఆ వార్త విని అష్పాఖ్‌ బాగా ఏడ్చారు. బాధపడ్డారు. అన్నయ్య సమాధి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి ఇంటికి వచ్చారు. ఆ రాత్రి పదకొండు గంటల రైలుకు బీహార్‌ వెళ్ళిపోయారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug. by Sudhir Vidyardhi. Page.47).

ఆ తరువాత అష్పాఖ్‌ పోలీసుల కన్నుగప్పి షాజహాన్‌పూర్‌ వచ్చి వెళ్ళారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఉన్నతాధికారులు మండిపడ్డారు . ఆగ్రహంచారు. ఆ ఆగ్రహాన్ని అష్పాఖుల్లా అన్నరియాసతుల్లా ఖాన్‌ ఇంటి మీద చూపారు. ఆయన నివాసం మీద దాడిచేసి, ఇంటిలోని సామానులను జప్తు చేసారు. ఈ సందర్భంగా అష్పాఖుల్లా ఖాన్‌ రాసిన లేఖలు, కవితలు, ఆయన తయారుచేసుకున్ననోట్స్ ను పోలీసులు ఎత్తుకెళ్ళారు. ఇంట్లో వారిని ఆడ మగ తేడాలేకుండా హింసించారు. పోలీసులు ఎన్నడూ లేని విధంగా చాలా బీభత్సం సృష్టించారని అష్పాఖుల్లా సోదరులు మహమ్మద్‌ రియాసతుల్లా వెల్లడించారు.

అష్పాఖుల్లా పరారిలో ఉన్నప్పుడు పంజాబుకు చెందిన ప్రముఖ విప్లవకారుడు శ్రీ లాలా కేదారనాధ్‌తో ఆయనకు పరిచయమైంది. ఆయన అష్పాఖుల్లాతో మాట్లా

46