పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

ప్రశ్నించాను. జిల్లా కలక్టర్‌ నుండి సోదాకు వారెంట్ ఉందన్నారు. చూపెట్టమన్నాను. పొరపాటున నా చేతికి మరొక ఆజ్ఞాపత్రం ఇచ్చాడు. చదివాను. అది సోదాకు సంబంధించిన ఉత్తర్వుకాదు. అది అష్పాఖ్‌ను అరెస్టు చేయ మన్నఉత్తర్వు. ఆ ఉత్తర్వులను త్వరితగతిన చదివేసి, నాకు ఇంగ్లీషు రాదంటూ దానిని తిరిగి ఇచ్చాను. ఆ తరువాత అధికారి సోదాకు సంబంధించిన వారెంట్ చూపాడు. ఇంటిలోకి జొరబడడానికి చాలా తొందరపడుతున్నాడు. నా ఇల్లు ఎందుకు సోదా చేయాలని ఆడిగాను.

ప్రతాప్‌పుర్‌ జిల్లాలో దోపిడి జరిగింది. ఆ సంఘటన విషయమై సోదాలు జరుగు తున్నాయి అని ఫసాయత్‌ హుస్సేన్‌ అన్నాడు. గృహంలో ' పర్దానషీ స్త్రీలు ' ఉన్నారని తొందరపడుతున్న పోలీసులను అడ్డగించాను....ఇంట్లోల ఉన్న వారందారికి పోలీసులు వచ్చి ఉన్నారని తెలుపుతూ, పోలీసులు తలాషీ కోసం ఇంటిలోపలకి వస్తున్నారని, మేడ మీదికి వెళ్ళమని నా భార్యకు చెబుతున్నట్లుగా ఆందరితోపాటు, ఆఫ్పాఖ్‌ను హెచ్చరిం చాను...ఆ హెచ్చరికతో అష్పాఖ్‌ అప్రమత్తమం అయ్యాడు. నా హెచ్చరిక విని గబగబా లేచాడు. తన పెట్టెలో ఉన్న నిషేధిత పత్రిక 'వ్యాన్‌గార్డ్‌' కాపీలను తీసుకుని క్షణాలలో మేడ మీదకు వెళ్ళిపోయాడు...పోలీసులు ఇల్లంతా గాలిస్తున్నారు. అధికారులు బయట కూర్చుని ఉన్నారు. పోలీసు అధికారి హుస్సేన్‌ నాతో బాతాఖానీ ప్రారంభించాడు. మాటల్లో నన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తూ, 'అష్పాఖ్‌తో నాకు పరిచయం ఉంది, ఉన్నాడా ? పిలవండి, పిచ్చాపాటి మ్లాడుకుంటాం' అన్నాడు.

ఆ మాట వింటూనే, నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో అష్పాఖుల్లా ఎక్కడికో వెళ్ళిపోయాడన్నాను. ఆ సమాధానంతో అధికారి కంగారు పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు. ఎవరో ఓ పోలీసు అధికారి వచ్చి అష్పాఖ్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎక్కడికైనా వెళ్ళిపొమ్మని సలహా ఇచ్చాడని చెప్పాను. ఆ మాటతో ఫసాయత్‌ హుస్సేన్‌ మరింత కంగారు పడుతూ ఆ అధికారి ఎవరు? ఎవరని? అడిగాడు. మా శ్రేయోభిలాషి పేరు బయట పెట్టమంటారా? అంటూ నిరాకరించాను. పోలీసు అధికారి చాలా నిరాశపడ్డాడు.నన్ను పోలీసు స్టేషన్‌కు రమ్మన్నాడు. ఆయన వెంట నేను స్టేషన్‌కు నడిచాను.పోలీసు బలగాలతో సహా ఆ అధికారి నిష్క్రమించాడు...నేను పోలీసుల వెంట స్టేషన్‌కు వెళ్ళి తిరిగి వచ్చేసరికి అష్పాఖ్‌ బాల్కనీలో ఉన్నాడు. ఏమిటిదంతా? ఆని అడిగాను. తాను రివల్యూషనరీ పార్టీలో చేరానని, అది రహస్య విప్లవ సంఘ మని చెప్పాడు. అప్పుడుగాని నాకు అసలు విషయం తెలియలేదు .(Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi, Page. 39-41)

ఆ రాత్రి పోలీసుల కన్నుగప్పి అరెస్టు తప్పంచుకున్న అష్పాఖుల్లా, షాజహాన్‌పూర్‌

45