పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కాకోరి వద్ద రైలులోని ప్రభుత్వ ధనాన్ని కైవసం చేసుకున్న హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ ఆ సొమ్మును లక్నోకు తరలించింది. విప్లవోద్యమ నేత పండిత బిస్మిల్‌ సొమ్మునంతా వందరూపాయల కరన్సీలోకి మార్పించారు. ఆ సొమ్ములోని మూడు నోట్లు మాత్రం పొరపాటున షాజహాన్‌పూర్‌లో చలామణిలోకి వచ్చాయి. అవి కాస్తా బ్రిటిష్‌ విచారణాధికారి హార్డన్‌ చేతిలో పడ్డాయి. అప్పటి వరకు కాకోరి కేసు గురించి ఎటువంటి ఆధారం దొరకక సతమతమøతున్న పోలీసులకు మంచి క్లూ దొరికింది. హార్టన్‌ సంబరపడ్డాడు. ఆఘమేఘాల మీద ఆందిన ఆనవాళ్ళ ఆధారంగా తన బలగాన్ని పరుగులెత్తించాడు.

ఈ విషయాలేవి తెలియని కాకోరి వీరులు అప్పటి వరకు అజ్ఞాతానికి వెళ్ళలేదు. బిస్మిల్‌, అష్పాఖ్‌లు షాజహాన్‌పూర్‌లో స్వేచ్చగా తిరుగుతున్నారు. కరెన్సీ నోటు ఆధారంగా పోలీసులు తీగలాగగా డొంకంతా కదిలినట్టు కీలక విషయాలు తెలిసాయి. ప్రభుత్వం ఇక ఏమాత్రం ఉపేక్షించలేదు. ఈ సమాచారం ఆధారంగా దేశంలోని విప్లవకారుల స్థావరాలు, గృహాలు, ఇతర ప్రాంతాల మీద 1925 సెప్టెంబర్‌ 26 రాత్రి పోలీసుల దాడులు ఒక్కసారిగా జరిగాయి. అన్ని వైపుల నుండి పోలీసు బలగాలు కమ్ముకున్నాయి. ఈ దాడులలో సుమారు 30 మందిని అరెస్టు చేశారు. ఈ పోలీసు దాడులలో శ్రీ చంద్రశేఖర్‌ అజాద్‌, శ్రీ శచీంద్రనాధ్‌ బక్షీ, అష్పాఖుల్లా ఖాన్‌ తప్ప, కాకోరి సంఘటనలో పాల్గొన్న అందరూ దొరికిపోయారు.

అజ్ఞాతంలో అష్పాఖ్‌

1925 సెప్టెంబర్‌ 26 రాత్రి పోలీసులు అష్పాùఖ్‌ గృహం మీదా కూడ దాడి చేశారు. ఆ సమయంలో అష్పాùఖ్‌ సోదారులు రియాసతుల్లా ఖాన్‌ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అష్పాఖ్‌ థైర్యం చేయడంతో పోలీసుల కళ్ళుగప్పి అజ్ఞాతంలోకి వెళ్ళగలిగారు. ఆయన తన ఇంటికి అరమైలు దూరంలో ఉన్న చెరుకు తోటలో కొంతసేపు దాక్కొని, అక్కడి నుంచి పరారయ్యారు. ఆ రోజు రాత్రి జరిగిన విషయాలను రియాసతుల్లా ఖాన్‌ ఈ విధంగా వివరించారు.

ఆ రోజు తెల్లవారుజామున నమాజ్‌ కోసం నిద్రలేచాను. అప్పటికే నా భార్య నమాజ్‌ చదువుతోంది. ఇంటి గడియ ఎవరో కొడుతున్నారు. వెళ్ళి తీసాను. ఎదురుగా పోలీసు అధికారి ఫసాయత్‌ హుస్సేన్‌, ఆయనతోపాటు పలువురు పోలీసులు ఉన్నారు. విషయమేమిటని అడిగాను. సోదా కోసం వచ్చానన్నారు. రాత్రిపూట సోదా ఏంటని

44