పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

డుతూ, బ్రిటిషు పోలీసులకు చిక్కకుండేందుకు సరిహద్దులు దాటి పోవాలనుకుంటే నేను సహాయపడగలను. మీకు ఎటువంటి ప్రమాదం రాకుండా మిమ్మల్నిసరిహద్దులు దాటించగలను. అది నాకు చాలా సులువు అన్నారు. స్వదేశం విడిచి వెళ్ళటం అష్పాఖ్‌కు ఇష్టం లేదు. శ్రీ లాలా సలహాకు సమాధానంగా, నేను హిందూస్థాన్‌ నుండి పరారి కాదాలచుకొలేదు. సోదారా! ముస్లింలలో కూడా ఒకరిని దేశం కోసం ఉరికంబం ఎక్కని వ్వండి, అని మాతృభూమి సేవలో ప్రాణత్యాగం చేయాలన్న తన మనోవాంఛను అష్పాఖుల్లా ఖాన్‌ ఆ సందర్భంగా వెల్లడించారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi, Page.47)

అజ్ఞాతంలో.... కూలీగా అవతారం

బ్రిటిష్‌ పోలీసుకు టోకరా ఇచ్చి మారువేషాలలో తప్పించుకు తిరుగుతున్న అష్పాఖుల్లా ఖాన్‌ తిన్నగా బీహార్‌ రాష్ట్రంలోని డల్టన్‌ గంజ్‌ జిల్లా చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని ఒక కర్మాగారంలో సామాన్య కూలిగా పనికి కుదిరారు. ఆయన వేషం, భాష మార్చారు. తనను తాను సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నారు. ఓ సామాన్య కూలీగా ఆయన రహస్యజీవితాన్నిఆరంభించారు.

అష్పాఖ్‌ డల్టన్‌ గంజ్‌లోని కర్మాగారంలో పని చేస్తూ చాలా సురక్షితంగా గడిపారు. అక్కడ ఒకసారి జరిగిన కవి సమ్మేళనానికి ఆయన హజరయ్యారు. అక్కడ ఆయనలోని కవి ప్రదర్శిమయ్యాడు. మంచి ఉర్దూ కవితలను ఆ సందర్భంగా గానం చేశారు. సాహితీ ప్రేమికుల మన్నన పొందారు.అష్పాఖ్‌ పని చేస్తున్న కర్మాగారం యజమానికి ఉర్దూ కవితలు అంటే పంచప్రాణాలు. అష్పాఖుల్లా చేత ఆయన మరీ మరీ కవితలు చెప్పించుకుని ఆనందించారు. చక్కని కవిత్వం రాయటమేకాక మనోహరంగా కవితాగానం చేయగల అష్పాఖ్‌ తన వద్ద కొలువుకు ఉండడాన్నిఆయన చాలా గర్వపడ్డాడు.

అష్పాఖ్‌ ప్రతిభకు సంతోషించిన యజమాని అష్పాఖ్‌ జీతాన్ని భారీగా పెంచాడు. ఈ వాతావరణంలో అష్పాఖ్‌ హిందీని బాగా అభివృద్ధిపర్చుకున్నారు. బెంగాలీలో పాటలు రాయటమే కాకుండా, మనోహరంగా పాడగలిగేంతగా పట్టు సాధించారు. అష్షాఖ్‌ ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకుండా, కష్టించి పనిచేస్తూ యజమాని ప్రత్యేక ప్రేమాభిమానాలు పొందారు.

47