పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నీవెప్పుడూ నా ఆజ్ఞాపాలన చేసావు. నీవెంతో విశాలహృదయం కలిగినవాడివి. నీ భావాలు సమున్నత మైనవి, అని ప్రశంసించారు.(బిస్మిల్‌ ఆత్మకథ: 107)

విప్లవోద్యమం పట్ల దృఢసంకల్పం గల బలశాలి అష్పాఖ్‌ను దళ సభ్యునిగా స్వీకరించినందుకు ఆ తరువాత బిస్మిల్‌ ఎంతో గర్వించారు. ఆయనను మహావీరునిగా పరిగణించారు. ఈ విషయాన్ని చాలా గర్వంగా ప్రకటించారు. నాకిప్పుడు కొంతైనా తృపిగా వున్నదంటే, ఈ ప్రపంచంలో నా పేరు ప్రతిష్టల్ని నీవు సముజ్వలం గావించావనే. అష్పాఖుల్లా విప్లవోద్యమంలో పాల్గొన్నాడు. తోబుట్టువు, బంధు మిత్రులు ఎంతగా వారించినా ఆతడు ఏమాత్రం లెక్కచేయలేదు. అరెస్టయిన పిదప కూడా తన భావాలను వదలుకోకుండా సుదృఢంగా నిలిచాడు' అనే ఈ సంగతి భారత దేశ చరిత్రలో ఎంతో ఉల్లేఖనీయమైనది. శారీరకంగా నీవెలా బలశాలివో, మానసికంగా సైతం అలాగే మహా వీరునిగా నిలిచావు. నీ ఆత్మ మహోన్నతమైనదని నిరూపించుకున్నావు, (బిస్మిల్‌ ఆత్మకద: పేజీ.108) ఆని బిస్మిల్‌ సంతోషం వ్యక్తం చేశారు.

అష్పాఖుల్లా విప్లవోద్యమంలో తన్నుతాను అంకితం చేసుకొవడంతో ఆగలేదు. విపవోద్యమ ఛాయలు తన బంధు-మిత్రుల మీద కూడా ప్రసరింపచేయాలని ప్రయత్నించారు. విప్లవకారునిగా తన లక్ష్యాయలను సన్నిహితులకు ఎరుకపర్చుతూ వారిని కూడా మాతృభూమి సేవలో పునీతులయ్యేందుకు ప్రోత్సహించారు. ఈ విషయాన్ని బిస్మిల్‌ ప్రస్తావిస్తూ, నీ బంధుమిత్రులెంత మంది వున్నారో వారందరి పైన నీ అలోచనలు పడవేయడానికి ప్రయ త్నించావు, (పేజి.107) అని అష్పాఖ్‌ ప్రయ త్వాలను ప్రశంసించాడు. చివరకు ఈ కార్యక్రమాల ఫలితంగా, కోర్టులో నిన్ను నా లెఫ్టినెంటువని పేర్కొన్నారు. ఇక తీర్పు రాసిన న్యాయమూర్తి కూడా నీ మెడలో జయమాల (ఉరిత్రాడు) వేశాడు, అని ఆత్మకథలో బిస్మిల్‌ పేర్కొన్నాడు. (బిస్మిల్‌ ఆత్మ కథా ó పేజి.108).

అనుచరుడు కాదు సహచరుడు

విప్లవోద్యమంలో ఒకరికి అనుచరు నిగా ఉండడానికి అష్పాఖుల్లా ఖాన్‌ ఏమాత్రం ఇష్టపడలేదు. విప్లవ దళంలోని సభ్యులకు, చివరికి నాయకుడికి కూడా సహచరుడిగా మాత్రమే ఆయన మెలిగారు. మిత్రులతో సిఫార్సు చేయించుకుని, అతి కష్టం మీద రహస్య దళంలో స్థానం పొందినా, బిస్మిల్‌ను ఆయన ఎంతగా గౌరవించినప్పటికీ

26