పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

వేదిసున్నఆయనను చివరకు హిదూస్థాన్‌ రిపబ్లిక్క్‌ అసోసియషన్ లో చేర్చుకోక తప్పలేదు. ఆరంభంలో సహయనిరాకరణోద్యమంతో బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాలలో భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టిన అష్పాఖుల్లా ఖాన్‌ హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌లో చేరటంతో సాయుధ పోరాట యోధుడిగా పరిణామం చెందారు.

మాతృదేశ సేవకోసం విప్లవోద్యమంలో భాగస్వామి కావాలని, కలలు కంటున్న అష్పాఖ్‌కు ఆ కలలను పండించుకునే మార్గం లభించేసరికి సంతోషం ఉప్పొంగింది. నేను స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోరుకునేవాడిని. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి అర్పించడానికి సర్వదా సిద్ధం. బానిసత్వపు వరమాల, అది ఎలాణ్టిదైనా దానిని ధరించడానికి నేను ఇష్టపడను అని ప్రకటించుకున్న అష్పాఖ్‌ బిస్మిల్‌ వెంట విప్లవోద్యమంలోకి ప్రవేశించారు.

బిస్మిల్‌ తొలుత ఎంతగా అష్పాఖుల్లాను నిరాకరించారో, చివరకు విప్లవోద్యమం పట్ల అష్పాఖ్‌కు ఉన్న నిబద్ధత, ఆయనలోని త్యాగశీలత, కార్యాచరణను గమనించి అంతగా ఆనందించారు. అష్పాక్‌ నడతను, నిజాయితీని, నిక్కచ్చి విప్లవ భావాలను ప్రస్తావిస్తూ, నా ఆలోచనల రంగు నీకూ అంటుకుంది. నీవు కూడా రాటుదేలిన విప్లవ కారుడవై పోయావు. ఇక అప్పటినుండి అహోరాత్రులు నీదొక్కటే ధ్యాస...ఒకే ప్రయత్నం ఎలాగైనా సరే ముస్లిం నవయువకుల్లో కూడా విప్లవ భావాలు చొప్పించాలని, వారు కూడ విప్లవోద్యమానికి దోహదపడేట్లు చూడాలని, నీ బంధుమిత్రులు ఎంత మంది ఉన్నారో వారందరి మీద నీ ఆలోచన ప్రభావం వేయడానికి ప్రయత్నించావు...ఒక ముస్లింను విప్లవ పార్టీలో పేరెన్నిక గన్నసభ్యునిగా నేట్లా మార్చగలిగానా ఆని యితర సహచరులంతా కూడా తరుచూ విస్తుపోతూండే వాళ్ళు..నీదెంతో విశాల హృదయం..నీ భావాలు అత్యంత సమున్నతమైనవి, అని బిస్మిల్‌ తన ఆత్మకదలో పేర్కొన్నారు. (పేజి.107)

విప్లవదళ సబ్యుడిగా ఎంతటి క్లిష్టతరమైన బాధ్య తలను అప్పగించినా అష్పాఖుల్లా ఖాన్‌ ఎన్నడూ ఎదురాడలేదు. నిర్వహణలో విఫలం కాలేదు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా, సంఘం ఉమ్మడి నిర్ణయాలను గౌరవించేవారు. విధులను క్రమశిక్షణ గల సైనికునిగా ఆచరణలో పెట్టడం ద్వారా ఆయన బిస్మిల్‌కు మంచి సన్నిహితులయ్యారు. ఈ విషయాన్ని బిస్మిల్‌ ప్రస్తావిస్తూ, నీవు నా పట్ల చూపిన నడత ఎంతో ప్రశంసనీయమైనది. నీవెన్నడూ నా అజ్ఞను జవదాటలేదు. ఒక విధేయుడైన కార్యకర్తలా

25