పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అష్పాఖ్‌ వ్యవసాయాన్ని బాగా ఇష్టపడ్డారు. రైతుగా స్థిరపడితే స్వతంత్రంగా తమ రహస్య కార్యకలాపాలను సాగిస్తూ, స్వతంత్ర భావాలను, స్వేచ్ఛాయుత ఆలోచన లను, ఆశయాలను ప్రజలలో ప్రచారం చేయ వచ్చని భావించారు. ప్రజలను మోసం-దగా చేయకుండా కష్టించి పని చేసి సంపాదన సమకూర్చుకునేందుకు అనువైన రంగం వ్యవసాయరంగమని ఆయన అనుకున్నారు.

ఈ మేరకు మిత్రుడు బన్నారిలాల్‌కు రాసిన లేఖలో, నేను భూమికి యజమానినని నీకు తెలుసు. మా అమ్మగారు జమిందారిణి. నేను ఎంత భూమి కోరుకున్నాఅంతా నాకు లభిస్తుంది. నా వద్దఅవసరమైన ధనం లేదు . నీకు ఆసక్తి ఉన్నట్టయితే వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టు. నీవు నేనూ కలిసి అక్కడికి (వ్యవసాయం చేయడానికి తమ భూములున్న గ్రామానికి) వెడదాం. మనం మన రైతు సోదరుల మధ్య గడుపుతూ మన ఆలోచనలకు కార్యరూపం ఇద్దాం. ఈ రకంగా చేస్తే కొద్ది సంవత్సరాలలో మన వద్ద అవసరమైనంత ధనం సమకూరుతుంది. అప్పుడు మన ఆశయాలకు, ఆలోచనలకు భారీ స్థాయిలో ప్రచారం క ల్పించవ చ్చు. మన మిత్రులను కూడా ఇక్కడకు ఆహ్వానించవచ్చు. ప్రపంచంలో పవిత్రమైన లాభదాయక వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయం మాత్రమే. నీవు నీ కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలి కదా... వ్యవసాయం ఎందుకు ప్రారంబించరాదు? పెట్టుబడి నీది, భూమి నాది, శ్రమ మనిద్దరిది, ప్రాపంచిక అవసరాలను తీర్చుకోడానికి మనమిద్దరం సోదరులుగా కలసి పని చేస్తూ, యువకులు అనుకుంటే సాధించలనిది ఏమీ ఉండదని రుజువు చేద్దాం..నా సంబంధీకు లు నన్ను ఎలాగైనా ఉద్యోగ బానిసత్వంలోకి నెట్టీవేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయం మహత్తు వీళ్ళకు తెలియదు. భారతదశ విముక్తి వ్యవసాయం మీద ఆధారపడి ఉందని మనవాళ్ళకు తెలియదు, అని ఆయన తన మనోగతాన్ని స్పష్టం చేశారు. ఈ మేరకు సమాజం అనుమతించిన, గౌరవ ప్రదమైన పని ద్వారా మాత్రమే మన ప్రాపంచిక అవసరాలకు సరిపడా సంపాదన సమకూర్చు కోవాలని అష్పాఖుల్లా ఖాన్‌ సంకల్పించినట్టు తెలుస్తుంది.(Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi, Page. 94-95).

దళ సభ్యత్వ స్వీకారం

విప్లవోద్యమంలో భాగస్వామి అయ్యేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్న అష్పాఖ్‌ పట్టుదలను బిస్మిల్‌ విస్మరించలేక పోయారు. విప్లవ దళం సభ్యత్వం కోసం వెంటపడి

24