పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌ ఆ కారణంగా స్వయంగా తన జీవికను సంపాదించుకుంటూ, స్వేచ్ఛగా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగేందుకు వీలున్న మార్గాల కోసం ఆయన ప్రయత్నించారు.

ఈ విషయాలను తన స్నేహి తులు, కోకోరి రలు దోపిడి సంఘ టనలో సహచరుడైన శ్రీ బంవారిలాల్‌కు రాసిన ఒక లేఖలో స్పష్టం చేసారు. ఆ లేఖలో,

అష్పాఖుల్లాఖాన్‌

ఉద్యోగంలో చేరడం అంటే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హత్య చేయడమే . నేను స్వతంత్రంగా జీవనం సాగించాలనుకుం టున్నసంగతి నీకు తెలుసు. నేను ఉద్యోగంలో చేరి నా ముసలి తల్లి బాగోగులు చూసుకుంటే బాగుంటుందని నా బంధువులు ఆశిస్తున్నారు. అది కూడా కొంతవరకు సబబే. మా ధర్మం కూడా అదే బోధిస్తుంది. అయితే మాతృభూమికి సేవలందించే మహత్తర అవకాశం లభించదు. నేను భోపాల్‌లో ఈ దినమే ఉద్యోగంలో చేరాలనుకున్నా చేరగలను. అస్రార్‌ హసన్‌ ఖాన్‌ గారు నాకు ఏదో ఒక మంచి ఉద్యోగం ఇప్పించగలరు. మా అన్నగారు ఆయనను కలుసుకోమని సిఫార్సు లేఖ ఇచ్చారు. ఆయన సిఫార్సు వలన నాకు సైన్యంలో సుబేదార్‌ ఉద్యోగం కూడా తేలిగ్గా లభిస్తుంది. ఉద్యోగంలో చేరితే నాఆశలు, ఆశయాలన్నీ కల్లలైపోతాయి. మాతృభూమికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించేందుకు మాత్రమే నేను జీవించాలనుకుంటున్నాను తప్ప , బాగా డబ్బు సంపాదించి విలాసవంతంగా పదికాలాల పాటు సుఖజీవితం గడపాలని కోరుకోవడం లేదు. భయంకరమైన ప్రమాదాలను ఎదుర్కోడానికి నేను భయపడను. బాధపడను. ప్రపంచమంతా నన్ను అమాయకుడు, పిచ్చివాడన్నా నాకు ఏ చింతా లేదు. నేను అందుకోసమే (మాతృభూమి స్వేచ్ఛ కోసం-స్వాతంత్య్రం కోసం) జీవిస్తాను. మరణిస్తాను, అని రాసారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi, Page.94-95)

23