పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

ప్రబంధరాజవేంకటేశ్వర

     బలుసంజిడంబు కెంబట్టు పల్లముగాఁగ
               మొదటిపల్కులు మువ్వపదువుగాఁగ
     వినువాఁక తరగలు వెల్లజల్లులు గాఁగ
               వాల్మించు కెంపు హబాయిగాఁగ

గీ. జోడ నలమీఱి లేదెందు జోడనంగఁ
     బరుగుచున్నట్టి గరుడుఁడన్ గరుడునిపయిఁ
     జేరి నందిత ధారా విహారహారి
     సరణి వాహ్యాళి వేంకటస్వామి దలఁచి. 51

షడ్రుతూప మానాద్యంత యమక వచనము

వ. అప్పు డప్పన్నగనగవిభుం డానందమందిరంబైన యానందమందిరంబు ప్రేమం దిరంబుగా నొయ్యన వెడలి కడలి కడలెత్తి మొరయ వడువున నడవడిగల నడవడిని యడుగడుగు వెంబడిబోడము బడలిక లడంచి తడబడక బుడిబుడి మొక్కులిడి యెడనెడఁ బొగడు పౌరజన జయజయ నినదంబు మతకరించు భూరిభేరీ మృదంగ కాహళపటహ డెంకణఢక్కా హుడుక్కా నినాదంబుల లోఁగొను నిద్దపుఁ బెద్ద మద్దెలల మొఱపపు టుఱుములకు నెఱమెచ్చి పురివిచ్చియాడు నెమ్మికొమ్మల యొమ్మిక సమ్ముఖంబునం గమ్ముక ముమ్మరమ్ముగా వరుస బురుసాకాశలాశలం బసిఁడిపొడివసంతంబులాడ జోడుల కోలాటంబులు వేయు కైలాటకపు మిటుకులాండ్ర జాఱుజడల నల్లిన మల్లెపూసరుల వఱలు గమగమ వలపుల విటులకుఁ దలదిమ్ము పుట్టించునట్టి వెట్ట దినంబులయ్యును పార్శ్వ నిస్తంద్ర చంద్రశిలామయ చంద్రశాలోపరి భాగాభోగ వలభి దుపల వలభిపాళీకీలితచిరత్న రత్నకోరక వారక ఫలదీ బహుధావన సమాగ తంబులగు కలికిచిలుకల కులుకుపలుకుల కులుకు కలరవంబుల కలరవము కింకుర్వాణ మానసలై మను తలంపులు నుతించు ప్రోషిత భర్తృకల దృక్తారకంబుల కీ లెఱింగి తదుచిత శయ్యాతలంబునకుం దార్చి కూర్చు నెచ్చెలులు నేర్చు కైవడి కెలన నమర్చిన తేఁట పన్నీటి ధూమ్రంపు భస్త్రికలముంపున నసమయ హేమంత సమయంబయ్యును, మహోత్సవాలోకన కుతూహల నిఖిల దిశానిశాయాత మనుజ పరంపరా