పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxii

నిమ్ముల నేరీతి నే ధాతువులనేమి | రసముననైన వర్ణనము సేయ,
సరియేక సంధా, ద్విసంధా త్రిసంధల | దొడరినఁ బొరిఁబొరిఁగడవఁజదువ,
నెవ్వఁడేయవధాన మెఱుఁగు నయ్యవధాన ! మునవాని కించుముల్లు సూప,
వృత్త కందముఁ గందవృత్తంబునుఁ జతు | ష్కందంబు మొదలు గాఁగలుగుగర్భ
కావ్యవర్గముఁ జెప్పఁగాఁ బ్రబంధంబులు | గ్రొత్తలు పుట్టించుకొని లిఖింపఁ
గా, నక్షరచ్యుతకంబు మాత్రాచ్యుత | కంబుబంధచ్యుతకంబు నామ
గోప్యంబులుం శ్రియా గోప్యంబులును భావ ! గోప్యంబులుం జెప్పగోష్టియందుఁ
బద్యంబుగీతి కార్భటి నొగిఁ జదువంగ | నెల్ల విద్యల నంచులెఱుఁగనేర్తు,

తే. ననుచు నెల్లూరి తిరుకాళమనుజ విభుని| సముఖమ్మున సాహిత్య సరణి మెరసి,
మహిమగాంచిన పెద్దయామాత్యసుకవి | మనుమఁడవు నీ వంశమహిమయొప్పు.”

ఈ పెద్దయ కాలమును శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మగారు తమ రెడ్డిరాజుల చరిత్రమున (History of the Reddy Kingdoms Andhra University) చక్కగా నిర్ణయించినారు. పెద్దయామాత్యుఁడు నెల్లూరి తిరు కాళ మనుజ విభుని సముఖమ్మున నుండినవాఁడు. తిరుకాళరాజులు ఇరువురుండిరి. మొదటివాఁడు తిక్కనకు ప్రభువైన రెండవ మనుమసిద్ధికి తండ్రి చోడతిక్కరాజు, రెండవవాఁడు ఈ రెండవమనుమసిద్ది కొమారుఁడు. మొదటి చోడతిక్క రాజునకు మనుమఁడు. ఈతఁడు పదమూఁడవ శతాబ్ది చివరి కాల మువాఁడు. జక్కన తాతయైన పెద్దయామాత్యుఁడు ఈ రెండవ తిక్కరాజు కాలమువాఁడని శ్రీ శర్మగారి యభిప్రాయము. క్రీ. శ. 1285 ప్రాంతము లేదా 1281.

దాదాపు 13వ శతాబ్ది చివరికాలమున, గ్రంథస్థములు కాకపోయినను, కవితాగోష్టులలో బంధకవిత్వ చిత్రకవిత్వాదులుండినవని నిశ్చయింపనగును. మఱి పెద్దయ తెనుఁగునందా లేక సంస్కృతమందా తన కవితాశక్తిని చూపినది అను శంకకు అవకాశమే లేకుండునట్లు జక్కనయే 'ఆంధ్రకవిత్వంబునందు’ అనిచెప్పినాఁడు. అప్పటి కింకను తిక్కనగతించి చాలకాలమై యుండదు. కవిత్రయమునందలి కవిద్వయమే వెలసియుండినది. ఆరణ్యపర్వశేషమును ఎఱ్ఱన యింకను పూరింపలేదు. అదియింకను పురాణకవిత్వములకాలమే. అట్టి కాలమున జక్కనతాత పెద్దయ 'ఆంధ్రకవిత్వంబునందుఁ బ్రబంధంబు, మేలునాఁదజ్ఞులు మెచ్చఁజెప్ప ... గర్భకావ్యవర్గముఁజెప్పఁగాఁ బ్రబంధంబులు