పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

ప్రథమాశ్వాసము


చటులవాల కశాఘాతసంప్రభూత-
నీరమడ్డుస్వనంబున నింగి యదుర.

60


సీ.

కాఁడిపాఱిన మేనిగరులు బ్రహ్మాండంబు
             కడపపూబంతి కక్కజము దోఁప
ఖురపుటంబునఁ గీలుకొని మేరుకుధరంబు
             మువ్వలోపలి ఱాతిమురువు వడయ
దీర్ఘకంఠకఠోరఘుర్ఘురస్వనమునఁ
             బాతాళగోళంబు బాతళింప
నీలాంబుదశ్యామనిబిడదేహచ్ఛాయఁ
             బ్రళయాంధకారంబు దొలకరింప
సప్తపాతాళముల క్రిందఁ జాఁగిపడిన
యవని నెత్తె నిశాతదంష్ట్రాంకురమున
నభినవస్తబ్ధరోమదివ్యావతారుఁ
డంబురుహలోచనుండు కల్పాదియందు.

61


వ.

ఇవ్విధంబున మహాపర్వతసన్నిభంబును నీలమేఘప్రతీకాశంబును దంష్ట్రాదండదారుణంబును విపులవృత్తఘనస్కంధంబును సమున్నతకటితటంబును హ్రస్వవృత్తోరుజంఘాగ్రంబును దీక్ష్ణఖురమండలంబును బద్మరాగసదృశేక్షణంబును దృఢదీర్ఘమహాప్రోథంబును సముదీర్ణోచ్ఛ్వాసనిశ్వాసవిఘూర్ణిత ప్రళయార్ణవంబును విద్యుచ్ఛటాపాటలనటచ్ఛన్న కపోలస్కంధబంధురంబునునయిన వరాహరూపం బావహించి రసాతలంబున సలిల