పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

18


ఉ.

.............................................లెందణంగిరో
చుక్కలసుద్ది యెద్దియొకొ చూడఁగఁ గందుమె పర్వతంబులన్
దిక్కుల చాయ లెవ్వి యని ధీరత నల్విటు చింత(నొందెఁగా)
..................................హతి విశ్వము ముంచియుండఁగన్.

56


క.

అంతఃకరణంబున నటు
చింతిలి యుండుచుఁ బ్రపంచసృష్టికినిఁ గ్రియో-
దంతమ్ము లేక దుర్వ్యథ
సంతన కట్టఁగ విధాత చాలండయ్యెన్.

57


వ.

వెండియు బహువిధంబుల నూహాపోహ లొనర్చియుఁ బుండరీకసంభవుండు భువననిర్మాణక్రియారంభంబునకు నుపాయంబుఁ గానక చీకాకుపడి కాకోదరగ్రామణీగ్రైవేయు భగవంతుం గృతాంతఘస్మరు సంస్మరించి తత్ప్రసాదంబున వసుంధరాగోళంబు మహాంధకారమగ్నం బగుట యెఱింగి యజ్జగద్ధాత్రుల నుద్ధరింపం దలంచి.

58


శా.

క్రోడాకారము [1]దాల్చి కంఠభవఘుర్ఘుధ్వానవిస్ఫూర్తిఁ బా-
తాళక్రోడమహాకటాహమున సందారింపఁ దత్కంధరా-
గోళస్థాయినియైన భూమి పృథువక్షోజప్రదేశంబునన్
లీలాసత్పులకాంకురంబు లెగయన్ వెన్నుండు మున్నీటిలోన్.

59


గీ.<poem>లోఁతుమున్నీటిలోపల నీఁతలాడెఁ గూటకోలావతారుఁడై కైటభారి/poem>
  1. దాల్చెఁగంఠ