పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

20


మగ్నయగు పృథివి నుద్ధరించిన.

62


గీ.

దానవారాతిదంష్ట్ర నెత్తంగఁబడిన
యుర్వి సూపట్టు జలధి నీ రోడి......
..........................................
...........వెలిపట్టు జగజంపు గొడుగువోలె.

63


సీ.

జయజయధ్వనులతో సనకాది మునికోటి
                   వేదాక్షరంబుల వినుతి సేయ
బహుళసౌరభమ........ లుప్పతిల్లంగ
                   విద్యాధర...........విరులు గురియ
దివ్యదుందుభిసముత్థితనినాదంబుల
                   భూ.........భంబు బోరు కలఁగ
జోకయై యప్సరస్సుదతీకదంబంబు
                   నింగిమీఁదఁ బ్రమోదనృత్త మాడ
జద్దువడి యుండె నొక కొంత ప్రొద్దు వేడ్క
నవయవంబులు గరుదాల్ప నచ్యుతుండు
ప్రళయజలనిధి క్రింద ..పడినయట్టి
యుర్వి దంష్ట్రాంకురంబున నుద్ధరించి.

64


గీ.

సురలు తనమీఁదఁ బువ్వులసోన గురియఁ
జూడ నొప్పారె హరి శఠక్రోడమూర్తి
కందరంబుల ఖద్యోతగణము మెఱయఁ
జాల నొప్పారు నంజనాచలము వోలె.


వ.

ఇవ్విధంబునఁ బ్రళయసలిలోపద్రవం బుడిపి ధాత్రిఁ