పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

ప్రథమాశ్వాసము


బులం గలిగిన మ..... యందు .......బందిన మల్లినాథగురుండు.

13


సీ.

(లింగార్చ)నక్రియాలీల నే ప్రొద్దును
             గరికాలచోడని కరణివాఁడు
జంగమారాధనాసక్తి మైన.....
             .......
......
             .......య్యసరణివాఁడు
వరధర్మచాతురీవైభవఖ్యాతిచే
             చెన్నమరాయని చెలువువాఁడు


ననఁగ నిద్ధాత్రి నింపారు నఖిలకళల
సకలనిర్మాణవిద్యాప్రశస్తుఁ డనఁగ
మానితైశ్వర్యసంప్రాప్త........
మల్లికార్జునయోగిసమాజవరుఁడు.

14


క.

ఆతని వంశంబునఁ బ్ర
ఖ్యాతచరిత్రప్రతాపకలనాధర్ముం
డాతతవిక్రమశీలుఁడు
భూతలమునఁ గొమ్మవిభుఁడు పొలుపై వెలసెన్.

15


సీ.

చేవూరిభీమేశుఁ జెలువార గుండెలఁ
             బూజ గావించిన పుణ్యమూర్తి
కడిమిమై నిరువత్తుగండనిచే మల్లి
             కార్జును కుత్పలం బర్థిఁ బడసె