పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

6


గొలని రామారెడ్డివలన లింగాల
             ..............రిమెతోడ
భక్తిరాజాఖ్యుచేఁ బర్వతేశ్వరునకు
             నర్పించెఁ జెరువాలు నాతుకూరు


గీ.

ధరణిఁ ద్రిపురాంతకున కాముదాలపల్లి
రాయవేశ్యాభుజంగువల్లావ యిచ్చె
నిట్టి పౌరుష.................
పోలిదేవయ్య చెన్నారుఁ బుణ్యమూర్తి.

16


వ.

ఆ గురుస్వామి నిజవంశాచారంబునకు దగిన తలోదరిం బరిణయంబయ్యె నంత.

17


సీ.

గౌరీతలోదరి గాఁబోలు నీ భా..
             ................యుండు
శ్రీలక్ష్మి గాఁబోలుఁ జెలువ సౌభాగ్యంబు
             దిక్కులనెల్లను బిక్కటిల్లు
వాగ్దేవి గాఁబోలు వామాక్షి బహుశాస్త్ర
             పాండిత్యవిస్ఫూర్తిఁ బరిఢవించు
నింద్రాణి గాఁబోలు నిందునిభాస్య....
            .....ఖ్యాతిమై బరఁగుచుండు


గీ.

ననఁగ నేప్రొద్దు గుణముల నతిశయిల్లి
పరఁగు శ్రీశైలనాథుని పట్టణమునఁ
బోలిదేవయ్య కులసతి పుణ్యచరిత
ముదిత సజ్జననికురుంబ ముమ్మమాంబ.

18