పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

4


యాతారార్కసుధాంశువై కమలజాతాకల్పమై యెప్పుడున్
జ్యోతిశ్చక్రముఁ బోలెఁ గ్రాలవలదా సొం.............

12


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును, గురుప్రశంసయుఁ, గవీశ్వరప్రస్తుతియుఁ, గుకవినిరాకరణంబునుం జేసి యొక్క కవితావిధానంబు శైవంబుగా సుకుమారచరిత్రంబు ............. స్వస్తి శ్రీపర్వతస్వయంభూ శ్రీలింగచక్రవర్తి శ్రీమన్మల్లికార్జునమహాదేవుని ముఖమండపంబున సుఖాసీనులయి యంచుగండ పృథ్వీమహా.................భక్తప్రకరంబులును, విజయసదృక్షులగు శుద్ధక్షత్రియులును, ధనపతిసమానసంపద్భాసితులగు వైశ్యులును, నిర్వక్రపరాక్రములగు వీరభటులును, శంకరపురాధ్యక్షులును, స్థానా......................నియోగంబును, గుండలి దండ లాసక ప్రేరణి ప్రేంఖణంబులైన చతుర్విధనృత్తగీతవాద్యాభిజ్ఞులును, గళావిలాసకరణాసనబంధురబంధభేదంబులం గంధర్వసంగరప్రవీణలయిన ............... సియుండ, శ్రీశాంతభిక్షావృత్తియతీశ్వరుండు శివకథావిధానంబులఁ బ్రొద్దులు పుచ్చుచుఁ దన మూలభృత్యుండగు నుప్పలపు ముమ్మడిదేవయ్య శాంతునిం గనుంగొని నీ పేర న................ కవిత్వంబున నీ కథ యుపన్యసింపుమనిన మహాప్రసాదంబని సత్కవిసార్వభౌముండగు శ్రీనాథకవివరేణ్యుని గృపావిశేషంబునం గాంచి శ్రీమన్మల్లికార్జున మహాదేవ................................. అంచుగండముఖ్య వరణా....లోష్ఠయేకోరామేశ్వరపండితారాధ్యాది చాతుర్వర్ణ్యం