2
శకున శాస్త్రము
క.సిరు లలరిన శకునములకు
నెరయోజకు లైన యశ్వ నీ దేవతలన్,
గురుతర భక్తి నుతింతును,
సిరి వర వరశుభము లొసఁగు | శిఖినరసింహా.3
తా. ఐశ్వర్యములు కలుఁగు శకునములను, మనుష్యులకు సంభవింపజేయునట్టి అశ్వనీ దేవతలను మిక్కిలి భక్తితో ప్రార్థించెదను, లక్ష్మీవల్లభా! ఓశిఖినరసింహస్వామీ! నాకు శుభములు గలుగఁ జేయుము.
-:శుభశకునములు:-
క.పంచమహా వాద్యంబులు,
మించిన భేరీ ధ్వనులును [1] మెఱవడి శబ్దం
బంచిత శుభవాక్యము[2] లీ
క్షించిన, శుభ శకునములగు | శిఖినరసింహా.4
తా. ఓనరసింహా! ప్రయాణసమయమునందు, వీణ, మద్దెల, సన్నాయి, తప్పెట, తాళములు మొదలగు వాట్ల వాయిద్యములు, భేరీధ్వనులు, బాకాధ్వనులు, మంచి వాక్యములు వినుట శుభము గల్గించును.
క. ఫలములుఁ గాయలుఁ బువ్వులు,
వెలయాండ్రును గన్నె పడుచు, విప్రద్వయమున్
దెలుపన్నముఁ బాయసమును
జెలువగు శుభశకునము లగు | శిఖినరసింహా.5
తా. ఓనరసింహస్వామీ ! ప్రయాణసమయమునందు పండ్లు, కాయలు, పువ్వులు, వేశ్యలు, కన్నె పడుచులు, ఇద్దఱు బ్రాహ్మణులు,