పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శకున శాస్త్రము

3

తెల్లని యన్నము, పరమాన్నము, ఇవి యెదురగుట శుభము
గల్గించును.

క. ఏనుఁగు గుఱ్ఱముఁ బీనుఁగు,
మానుగ బస వేశ్వరుండు § మఱిఁ బాల్పెరుగున్ ,
సేనయు[1] 1 జ్వలించునగ్నియు,
శ్రీనాధా! శుభములగును § శిఖినరసింహా. 6

తా. ఓ లక్ష్మీపతీ! నరసింహస్వామీ! ఏనుఁగు, గుఱ్ఱము,
శవము, ఆఁబోతు, పాలు, పెరుఁగు, సైన్యము, మండుచుండెడియగ్ని,
ఇవి ప్రయాణము చేయునపుఁ డెదురైన శుభము కల్గును,

4. నిండిన కడవలు రెండును,
మెండగు చేపలును గల్లు § మించిన కావి
ళ్ళండనే గాజుల సెట్టియుఁ
జెండును మఱిదోషములను § శిఖినరసింహా, 7

తా.ఓ నరసింహా! నిండుగా నీరుగల కడవలు రెండును,
చేవలు (ముత్యములు) కల్లు కావళ్ళు, గాజుల సెట్టియు య్రాణము
నందెదురైనచో దోషములు పోగొట్టును.

-: అపశకునములు:-

క. పోవద్దన [2] బోనేలన,
నే వచ్చెదనన్న నేడ § కేగెద వన్నన్
బోవం గని చెఱఁగొడసిన,
జీవములకు హాని యండ్రు § శీఖనరసింహా.

  1. గోప్పగు మంటయు పాఠాంతరము
  2. బోనీ యన పాఠాంతరము. బో నేయన =భుజింపుమన ; ఇదితత్సమశబ్దము,
    “భోంచేయన" అని మార్చినను సరిపోవును