పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2

శకున శాస్త్రము

క.సిరు లలరిన శకునములకు
  నెరయోజకు లైన యశ్వ నీ దేవతలన్,
  గురుతర భక్తి నుతింతును,
  సిరి వర వరశుభము లొసఁగు | శిఖినరసింహా.3

తా. ఐశ్వర్యములు కలుఁగు శకునములను, మనుష్యులకు సంభవింపజేయునట్టి అశ్వనీ దేవతలను మిక్కిలి భక్తితో ప్రార్థించెదను, లక్ష్మీవల్లభా! ఓశిఖినరసింహస్వామీ! నాకు శుభములు గలుగఁ జేయుము.


-:శుభశకునములు:-


క.పంచమహా వాద్యంబులు,
   మించిన భేరీ ధ్వనులును [1] మెఱవడి శబ్దం
   బంచిత శుభవాక్యము[2] లీ
   క్షించిన, శుభ శకునములగు | శిఖినరసింహా.4

తా. ఓనరసింహా! ప్రయాణసమయమునందు, వీణ, మద్దెల, సన్నాయి, తప్పెట, తాళములు మొదలగు వాట్ల వాయిద్యములు, భేరీధ్వనులు, బాకాధ్వనులు, మంచి వాక్యములు వినుట శుభము గల్గించును.

క. ఫలములుఁ గాయలుఁ బువ్వులు,
   వెలయాండ్రును గన్నె పడుచు, విప్రద్వయమున్
   దెలుపన్నముఁ బాయసమును
   జెలువగు శుభశకునము లగు | శిఖినరసింహా.5

తా. ఓనరసింహస్వామీ ! ప్రయాణసమయమునందు పండ్లు, కాయలు, పువ్వులు, వేశ్యలు, కన్నె పడుచులు, ఇద్దఱు బ్రాహ్మణులు,

  1. మెఱవడిశబ్దంబు = ఊరేగింపు అని కర్నూలువైపునవాడుక.
  2. లాలించి,లాసించిన, పాఠాంతరము. కాని సరియగునవికావు.