పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

21


-: రాహువు వారము లందు దిక్కున నుండు గడియల వివరము :-


క . భానుని వారము రాహువు,
    నానుగ రాతియునుఁ బవలు § నరువది ఘడియల్
    పూనుకొనియుండు ముదమున,
    శ్రీనాథా దక్షిణమున § శిఖినరసింహా,62

తా. ఓ నరసింహస్వామి ! ఆదివారమునాఁడు రాత్రింబవళ్లు
గడియలు రాహువు దక్షిణదిక్కునం దుండును.

క. ఇందుని వాసర మఱువది
   యందొక మంగళుని వార § మటు ముప్పదియున్
   పొందుగఁ దొంబది గడియలు
   చెందును నైరృతిని రాహు § శిఖపరి సింహా.63

తా. ఓ నరసింహస్వామి ! సోమవారము 60 గడియలు, మంగళ
వారము పగలు 30 గడియలు మొత్తము 90 గడియలు, రాహువు
నైరృతి దిశయందుండును.

క. మంగళుని రాత్రి ముప్పది
   ముంగల బుధవారమందు § మునునిరువది గూ
   డంగను నేబది వరుణుని
   చెంగట రాహువు వసించు § శిఖినరసింహా,64

తా. ఓ నరసింహస్వామీ! మంగళవారము నాడు రాత్రి 30 గడి
యలు, బుధవారమునాటి పగలు 20 గడియలు మొత్తము 50 గడియ
లు రాహువు పడమటి దిశయందుండును.

క. పొరినిలిచిన నలువదియును
   వర సౌమ్యుని వారమందు § వాయవ్యమునన్ .
[1] గురువారము భృగువిరువది
[2] సిరివరదా యుత్తరమున § శిఖినరసింహా.65

  1. గురువారంబు నెనబది
  2. సిరిమగఁడా పాఠాంతరము