పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

శ కు న శా స్త్ర ము


తా. ఓ నరసింహస్వామి! బుధవారమున మిగిలిన 40 గడియలును
రాహువు వాయువ్యదిశయం దుండును. గురువారమునాఁడు 60 గడి
యలును, శుక్రవారమునాఁడు 20 గడియలు మొత్తము 80 గడియలు
రాహువు ఉత్తరదిశయందుండును.

క. అల భార్గవువారంబున
   నలుబది స్థిరవారమందు § నట ముప్పదియున్
   గలసిన డెబ్బది గడియలు
   చెలువుగ నీశాన్యమందు § శిఖినరసింహా 66

తా. నరసింహస్వామీ! శుక్రవారములో మిగత 40 గడియలు
శనివారమునాఁడు 30 గడియలు మొత్తము 70 గడియలు రాహువు
ఈశాన్యదిశయం దుండును.

క. శనివారము ముప్పదియును
   ఘనరాహువు తూర్పునుండి § కడువడి జనియ
   య్య నలునిపై , నిలువక
   దక్షణమున దగుఁ దొంటిపగిది § శిఖినరసింహా,67
 
తా. ఓ నరసింహస్వామి! శనివారమున మిగత 30 గడియలు
రాహువు తూర్పు దిశనుండును. తరువాత వెంటనే ఆగ్నేయ దిశకు
బోయి అచట నిలువక వెంటనే దక్షిణమునకు పోవును (అట్లే క్రమ
ముగా తిరుగుచుండును).

క. ఇన గురు దినముల మఱితూ
   ర్పునదక్షిణమున కవీందు § లోలి, పడమరన్ ,
[1] విను కుజు నుత్తమున్ గది
సిన బుధశనులందు రాహు § శిఖినరసింహా,68

  1. గణభంగము